Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Canada Report Claims India Trying To Influence Politics Over Khalistan Concerns

Canada: ఖలిస్తాన్ ఆందోళనలపై రాజకీయాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది..

Published Date :May 4, 2024 , 4:02 pm
By Venu Goapl Reddy
Canada: ఖలిస్తాన్ ఆందోళనలపై రాజకీయాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Canada: కెనడా మరోసారి భారత్‌పై నిందలు మోపింది. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ హత్యలో ఇప్పటికే ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసినట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే కెనడా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆ దేశం మరోసారి ఆరోపించింది. ముఖ్యంగా ఖలిస్తాన్ నిరసనల నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు భారత్ జోక్యం చేసుకుంటుందని చెప్పింది.

గత రెండు ఎన్నికల్లో ఇలాగే విదేశీ జోక్యానికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొంది. భారత్ కెనడాలో తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థుల్ని ఎన్నుకునేందుకు యత్నిస్తోందని నివేదిక ఆరోపించింది. అయితే, భారత్ ఈ ఆరోపణల్ని నిరాధారమైనవని తిరస్కరించింది. ఇంతే కాకుండా న్యూఢిల్లీ అంతర్గత విషయాల్లో ఒట్టవా జోక్యం చేసుకోవడమే ప్రధాన సమస్య అని చెప్పింది. భారత్‌తో పాటు చైనా కూడా కెనడా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందని శుక్రవారం ప్రచురించిన నివేదిక పేర్కొంది.

Read Also: Shubman Gill : టీమిండియా మహిళ క్రికెటర్ కు బ్యాటింగ్ చిట్కాలు చెబుతున్న గిల్.. వైరల్ వీడియో..

కెనడాకు చెందిన ప్రాక్సీలతో సహా భారత్ అధికారులు కెనడియన్ కమ్యూనిటీలను, రాజకీయ నాయకులును ప్రభావితం చేసే అనేక రకాల కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని, ఈ కార్యకలాపాల్లో విదేశీ జోక్యం ఉందని, ఇది కెనడాలో భారత అనుకూల ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుందని, ప్రత్యేకించి కెనడా బెస్డ్ ఖలిస్తాన్ మద్దతుదారుల గురించి భారత ప్రభుత్వం ఎలా గ్రహిస్తుంది అని నివేదిక భారత్ గురించి ప్రస్తావించింది. కెనడాలోని కొంతమంది భారత్ వ్యతిరేకతకు పాల్పడుతున్నారని భారత్ భావిస్తోందని, ఇది భారతదేశ స్థిరత్వం, జాతీయ భద్రతకు ముప్పుగా చూస్తోందని నివేదిక చెప్పింది. ఖలిస్తాన్ వేర్పాటువాదంతో జతకట్టే వారిని దేశానికి “విద్రోహ ముప్పు”గా భారతదేశం చూస్తుందని నివేదిక ధ్వజమెత్తింది.

2019, 2021 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విదేశీ జోక్యం కోసం భారత్ దిశానిర్దేశం చేసిందని, భారత ప్రాక్సీ ఏజెంట్లు ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చని, వివిధ కెనడియన్ రాజకీయ నాయకులకు రహస్యంగా ఆర్థిక సహాయాన్ని అందించి ఉండిచ్చని పేర్కొంది. 194 పేజీల నివేదికలో భారత్‌ని 43 సార్లు ప్రస్తావించారు. భారత్‌తో పాటు కెనడాలో రష్యా, పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని గతంలో కెనడా పేర్కొంది. అయితే, భారత్ వీటిని తిరస్కరించింది. నిజానికి కెనడా వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు, భారత వ్యతిరేక శక్తులకు కేంద్రంగా మారిపోయిందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canada
  • Canada-India row
  • Hardeep Singh Nijjar
  • india
  • Khalistan

తాజావార్తలు

  • రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

  • Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు

  • Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

  • MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్

  • Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions