India-Canada Issue: ఖలిస్తానీ తీవ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు..కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- ఖలిస్తానీ తీవ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు..
- కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- ఇండియా-కెనడా ఉద్రిక్తతల మధ్య సంచలనంగా మారిన కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Issue: భారత్, కెనడాల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదంగా మారింది. గతేడాది నిజ్జర్ని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్లో ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని, వారే ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే వారి వివరాలను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి ఇస్తున్నారంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించింది.
అయితే, వీటన్నింటికి గట్టి ఆధారాలు లేవని చెబుతోంది. గతంలో చాలా సార్లు ఈ ఆరోపణకు ఆధారాలు ఇవ్వాలని భారత్ కోరినా, కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు రాలేదు. ప్రస్తుతం భారత్ కెనడా నుంచి తన రాయబారుల్ని ఉపసంహరించుకోవడంతో పాటు భారత్‌లోని కెనడా రాయబారుల్ని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
Read Also: YS Jagan: నెల రోజుల్లో ఇసుకను దోచేశారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, తాజా వివాదం మధ్య కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్(CSIS) తాత్కాలిక డైరెక్టర్ వెనెస్సా లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్తాన్ ప్రముఖ పాత్ర వహిస్తోందని అన్నారు. కెనడాలో భారత్ ప్రమేయాన్ని తగ్గించేందుకు పాకిస్తాన్ ఖలిస్తానీ తీవ్రవాదానికి నేరుగా మద్దతు ఇస్తోందని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యలు ఖలిస్తాన్ తీవ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఉందనే విషయాన్ని బహిర్గతం చేసింది.
ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం భారత్‌పై విమర్శలు తీవ్రతరం చేసిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. సెప్టెంబరులో ఫారిన్ ఇంటర్ఫరెన్స్ కమీషన్ ముందు హాజరైన సమయంలో ఆమె పాకిస్తాన్ ప్రమేయం గురించి నిజాయితీగా వెల్లడించారు. భారతదేశ ఉనికిని ఎదుర్కోవడానికి ఖలిస్తానీలకు పాకిస్తాన్ సహకరిస్తుందని ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!