Site icon NTV Telugu

Amit Shah: మహిళల కోసం మగాళ్లు మాట్లాడకూడదా..? కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు..

Amit Shah

Amit Shah

Amit Shah: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు కేంద్ర తీసుకువచ్చని బిల్లును స్వాగతిస్తూనే, ఓబీసీ రిజర్వేషన్ పై పట్టుబడుతున్నాయి. మరోవైపు ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బిల్లు తీసుకురావడం మంచిదే కానీ, తీసుకువచ్చిన సమయంపై పలువరు ప్రతిపక్ష నేతలు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు.

ఇదిలా ఉంటే అమిత్ షా చర్చ సమయంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడేందుకు లేచినిలబడిన బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే ను కాంగ్రెస్ నేత రధీర్ రంజన్ చౌదరీ అడ్డుకోవడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. నారీ శక్తి వందన్ అధినియంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడిన తర్వాత బీజేపీ తరుపున నిశికాంత్ దూబే మాట్లాడేందుకు నిలబడ్డారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ అధీర రంజన్ చౌదరీ మహిళా ఎంపీని నామినేట్ చేయాలని పట్టుబట్టడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

Read Also: Karima Baloch: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యపై కెనడా గగ్గోలు.. కరీమా బలూచ్ హత్యపై మాత్రం సైలెన్స్..

దీంతో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తొలుత తనను మాట్లాడిలేనందుకు ఆయన అసూయగా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. ‘‘ నేను అధీర్ జీని అదగాలను కుంటున్నాను, మహిళలు మాత్రమే మహిళల గురించి శ్రద్ధ చూపిస్తారా..? మహిళల గురించి పురుషులు మాట్లాడకూడదా..? మీరు ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు..? మహిళా సంక్షేమంపై సోదరుడు ఒక అడుగు ముందుకేయాలి అనేది మన దేశ సంప్రదాయం. మహిళా సంక్షేమం గురించి ఆలోచించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.మరి నిషికాంత్ జీ మా వైపు నుండి మాట్లాడటానికి లేచి నిలబడితే, అతని (చౌదరి) అభ్యంతరం ఏమిటి?బహుశా అతనికి మొదట మాట్లాడే అవకాశం రాకపోవటం వల్ల, అతను కొంచెం అసూయపడుతున్నాడు’’ అంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు.

మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని పేర్కొంది. అయితే ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై సెప్టెంబర్ 21న రాజ్యసభలో చర్చకు రానుంది.

Exit mobile version