NTV Telugu Site icon

Uttarakhand HC: భార్యతో బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడిన భర్తను శిక్షించొచ్చా..? హైకోర్టు ఏం చెప్పిందంటే..

Law News

Law News

Uttarakhand HC: సెక్షన్ 375 ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదని, ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం భార్యతో అసహజ శృంగారం చేసినందుకు భర్తను దోషిగా నిర్ధారించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. హైకోర్టు ఐపీసీ సెక్షన్ 375(రేప్), సెక్షన్ 377 నిబంధనల్ని వివరించింది. సెక్షన్ 375 (ఇది అత్యాచారాన్ని నిర్వచిస్తుంది) కింద భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం, పెళ్లయిన జంటలకు మినహాయింపు(2) కింద శిక్షార్హమైనది కాదు అని చెప్పింది. నవతేజ్ సింగ్ జోహార్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. నవతేజ్ జోహార్ తీర్పులో పెద్దల మధ్య అసహజ సెక్స్‌ని నేరంగా పరిగణించని కారణంగా, భారతీయ చట్టాలలో లైంగిక సంబంధాలకు వివాహాన్ని సమ్మతిగా భావించినందున, భార్యతో అసహజ శృంగారం చేసిన భర్తపై అభియోగాలు విధించరాదని హైకోర్టు పేర్కొంది.

ఐపీసీ సెక్షన్ 375 మినహాయింపు(2) ప్రకారం ‘‘ఒక పురుషుడు తన సొంత భార్యతో లైంగిక సంబంధం లేదా లైంగిక చర్యలు అత్యాచారం కాదు’’ అని పేర్కొంది. వివాహ సమయంలో అసహజ సెక్స్‌కి భార్య అనుమతి తెలియజేయలేదని ఆమె తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు. సెక్షన్ 377 ఐపీసీ అనేది బలవంతపు అసహజ సెక్స్‌కి శిక్షలు విధించే చట్టమని, ఇందులో భర్తకు అనుకూలంగా ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని వాదించారు. హిందూ వివాహ చట్టం-1955 లోని సెక్షన్ 13(2)(ii) ప్రకారం అసహజ సెక్స్ విడాకులకు కారణమని న్యాయవాది వాదించాడు.

Read Also: Godavari Floods: గోదావరికి శబరిపోటు.. ప్రమాద హెచ్చరికలు జారీ

‘‘ పై సెక్షన్ అనేది భార్యభర్తల మధ్య అసహజ శృంగారం జరిగినప్పుడు వర్తించదు. బాధితురాలు భర్తకు భార్య కానప్పుడు ఈ సెక్షన్ 13 (2) (ii) హిందూ వివాహ చట్టం, 1955 ఖచ్చితంగా అమలులోకి వస్తుంది. భార్యభర్తల మధ్య ఒక చర్య సెక్షన్ 375 ఐపీసీ 2 ప్రకారం మినహాయింపు ఉంటుంది కాబట్టి, ఆ చర్య ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరం కాదు.’’ అని హైకోర్టు పేర్కొంది.

భర్త తనపై బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడ్డాడని భార్య ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో భర్తపై సెక్షన్ 377ఐపీసీ యొక్క నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాదు అని కోర్టు అభిప్రాయపడింది. బలవంతంగా అసహజ శృంగారానికి లొంగకపోయేసరికి, బలవంతం చేయడానికి కొడుకుకి తన ల్యాప్‌టాప్‌లో అసభ్యకరమైన కంటెంట్ చూపించాడని, అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. పిల్లాడి ముందు బలవంతంగా శృంగారం చేశాడని చెప్పింది. దీంతో ఈ కేసులో పోక్సో చట్టం కింద నమోదైన కేసును హైకోర్టు సమర్థించింది. అసహజ సెక్స్ ఆరోపణల్ని పక్కన పెట్టింది.