Site icon NTV Telugu

Sharmishta Panoli: శర్మిష్ట పనోలికి బిగ్ షాక్.. బెయిల్ తిరస్కరించిన హైకోర్టు

Sharmishtha Panoli

Sharmishtha Panoli

Sharmishta Panoli: పూణేకు చెందిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీకు కోల్‌కతా హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఆపరేషన్‌ సింధూర్‌పై సినీ ప్రముఖులు మౌనం వహించడంపై శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. స్వేచ్ఛగా మాట్లాడడం అంటే ఇదేనా అని ప్రశ్నించింది.

Read Also: IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!

అయితే, వాక్‌ స్వాతంత్ర్యం సంపూర్ణం కాదు.. మతపరమైన వ్యాఖ్యలతో ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఈ హక్కు వీలు కల్పించలేదని గుర్తు పెట్టుకోవాలని కోల్‌కతా హైకోర్టు సూచించింది. శర్మిష్టకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా ఆమె వ్యాఖ్యానించారు. వాక్‌ స్వాతంత్ర్యం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ, ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడటం దాని అర్థం కాదు అని పేర్కొనింది. మన దేశం వైవిధ్యభరితమైంది.. అనేక కులాల, మతాల ప్రజలు ఇక్కడ కలిసి జీవనం కొనసాగిస్తున్నారని తెలిపింది. అలాంటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని కోల్‌కతా హైకోర్టు వెల్లడించింది.

Read Also: Minister Savitha: జగన్.. రౌడీ షీటర్లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే..

కాగా, శర్మిష్ఠ పనోలీకి మధ్యంతర బెయిల్ మంజూరుకు నిరాకరించిన న్యాయస్థానం.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే, ఉగ్రవాదులు పహల్గాంలో పురుషులపై జరిపిన మారణహోమం తర్వాత ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌పై కొందరు బాలీవుడ్‌ ప్రముఖుల సైలెంట్ గా ఉండటాన్ని ప్రశ్నిస్తూ మే 14వ తేదీన శర్మిష్ఠ సోషల్‌ మీడియా వేదికగా చేసిన వీడియో పోస్ట్‌ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె పోస్టుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత తన పోస్టులు, రీల్స్ తొలగించిన తర్వాత ఆమె క్షమాపణలు కూడా చెప్పుకొచ్చింది. అనంతరం శర్మిష్ఠను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.

Exit mobile version