NTV Telugu Site icon

CAA: సీఏఏ మతపర వివక్ష చూపిస్తోంది.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అసహనం..

Caa

Caa

CAA: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికాలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత్ తీసుకువచ్చిన సీఏఏ సమానత్వం, మతపరమైన వివక్షత, భారతదేశ అంతర్జాతీయ మానవహక్కుల బాధ్యతలకు అసంబద్ధమని, రాజ్యాంగ విలువలకు దెబ్బగా అభివర్ణించింది. ‘‘పౌరసత్వ సవరణ చట్టం అనేది మతం ఆధారంగా వివక్షను చూపిస్తోందని, ఇది మతోన్మాద చట్టం అని, దీనిని అమలు చేయకూడదు. దేశవ్యాప్తంగా ప్రజలు, పౌర సమాజం, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మరియు ఐక్యరాజ్యసమితి నుండి CAAని విమర్శించే అనేక స్వరాలను వినడంలో భారత అధికారులు విఫలమయ్యారు’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధి ఆకర్ పటేల్ అన్నారు.

Read Also: Anupama Parameswaran: కలువ పువ్వు లాంటి కళ్ళతో మాయచేస్తున్న అనుపమ పరమేశ్వరన్..

మరోవైపు ఐక్యరాజ్యసమితి(UN)..ఇది ప్రాథమికంగా వివక్షతతో కూడిన స్వభావం అని వర్ణించింది. యూఎన్ మానవహక్కుల హైకమీషనర్ కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ.. మేము 2019లో సీఏఏ వివక్షతతో కూడి స్వభావం కలిగినదని, భారతదేశం అంతర్జాతీయ మానవహక్కలను బాధ్యతలను ఉల్లంఘిస్తోదని ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ చట్టం అంతర్జాతీయ మానవహక్కుల చట్టానికి లోబడి ఉందో లేదో తమ కార్యాలయం అధ్యయనం చేస్తోందని అధికారి తెలిపారు. అమెరికా కూడా ఈ చట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో మేము నిశితంగా పరిశీలిస్తున్నామని స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పోక్‌పర్సన్ రాయిటర్స్‌తో చెప్పారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటూ భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు ఇలా ముస్లిమేతర మతాల వారికి భారత పౌరసత్వాన్ని అందించేందుక సీఏఏ ఉద్దేశింపబడింది. డిసెంబర్ 31, 2014కి ముందు వచ్చిన వారికి ఈ చట్టం కింద పౌరసత్వం అందించనున్నారు. అయితే, ముస్లింలకు ఎందుకు ఈ చట్టాన్ని అమలు చేయరని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, మూడు దేశాల్లో మైనారిటీలుగా ఉన్న వారు, అణిచివేతకు గురైన వారి కోసమే ఈ చట్టం తీసుకువచ్చామని అమిత్ షా స్పష్టం చేశారు.