Site icon NTV Telugu

Bypoll Election Results: 50 స్థానాలకు ఉపఎన్నికలు.. అందరి చూపు వయనాడ్, యూపీ వైపు..

Bypoll Election Results

Bypoll Election Results

Bypoll Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అందరి చూపు వయనాడ్, యూపీలో జరగబోయే ఉప ఎన్నికలపై నెలకొంది. వయనాడ్, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గెలుపొందడంతో ఆయన వయనాడ్ సీటుని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వయనాడ్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Read Also: Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు అంతా సిద్ధం..

అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ – 14 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 50 స్థానాలకు బైపోల్స్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లోని 06 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. కలకత్తా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి ఘటన నిరసనల తర్వాత ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి పరీక్షగా మారాయి.

యూపీలోని మీరాపూర్, కుందర్కి, సీసామవు, కటేహరి, ఫూల్‌ఫూర్, మజ్వాన్, ఘజియాబాద్, కర్హాల్, ఖైర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచి సత్తా చాటాలని అనుకుంటుండగా, లోక్‌సభ ఫలితాలను కంటిన్యూ చేయాలని ఎస్పీ భావిస్తోంది. 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా ఈ ఉప ఎన్నికలు చెప్పబడుతున్నాయి.

Exit mobile version