NTV Telugu Site icon

Mukhtar Ansari: రంజాన్ మాసంలో అన్సారీని దేవుడు శిక్షించాడు.. బీజేపీ ఎమ్మెల్యే ఫ్యామిలీ హర్షం..

Mukhtar Ansari

Mukhtar Ansari

Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ నిన్న జైలులో గుండెపోటుతో మరణించాడు. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన అన్సారీ ఒకానొక సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు. తనకు అడ్డొచ్చిన వాళ్లకు చావు భయాన్ని చూపాడు. తాజాగా అన్సారీ మరణంతో ఆయన వల్ల బాధింపడిన కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్తాన్ అన్సారీ చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కుటుంబం తమకు న్యాయం జరిగింది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసంలో ముఖ్తాన్ అన్సారీ భవిష్యత్తును దేవుడు నిర్ణయించాడని అన్నారు. 2005లో, కృష్ణానంద్ రాయ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించి ఇంటికి తిరిగి వస్తుండగా, అతని కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో కృష్ణానంద్ రాయ్ మరియు అతని ఆరుగురు సహాయకులు AK-47 బుల్లెట్లతో కాల్చి చంపబడ్డారు. ఏప్రిల్ 2023లో, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని కోర్టు కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Read Also: Tapsee Pannu:ఈ రొమాన్స్ ఎప్పటికీ ముగియదు.. పెళ్లి అనంతరం తాప్సీ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణానంద్ రాయ్ కుమారుడు పీయూష్ రాయ్ మాట్లాడుతూ.. తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, ముఖ్తాన్ అన్సారీ నిరంకుశుడు అని అన్నారు. మేము చాలా సంతోషిస్తు్న్నామని, ఇది బాబా గోరఖ్‌నాథ్ దయ, అతను పంజాబ్ జైళ్లలో ఉంటూ నేరాలకు పాల్పడే వాడు, ఉత్తర్ ప్రదేశ్ వచ్చిన తర్వాత తమకు న్యాయం జరిగిందని ఆయన చెప్పారు. అన్సారీ మృతిపై ప్రతిపక్షాల రాజకీయాలపై పీయూష్ రాయ్ మండిపడ్డారు.

మౌ సదర్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ అన్సారీని గురువారం సాయంత్రం స్పృహ లేని స్థితిలో జైలు నుంచి రాణి దుర్గావతి వైద్య కళాశాలకు తీసుకువచ్చారు. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 2005 నుంచి ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ జైళ్లలో ఉంటున్న 60 ఏళ్ల అన్సారీపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయి. గతేడాది ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు జారీ చేసిన 66 మంది గ్యాంగ్‌స్టర్లలో ఇతని పేరు కూడా ఉంది.