NTV Telugu Site icon

Sanjay Raut: అమిత్ షా మళ్లీ హోంమంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడింది..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. బుధవారం రౌత్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్‌లోని టెర్రర్ దాడులపై అమిత్ షాని టార్గెట్ చేశారు. అమిత్ షా ప్రతిపక్షాలను తుడిచిపెట్టే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. షా హోంమంత్రిగా ఉన్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక సంఖ్యలో భద్రతా బలగాలు, పౌరులు మరణించారని ఆరోపించారు. ఢిల్లీలో మోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే 10 మంది మరణించారని, హోంమంత్రి తీవ్రవాదుల్ని నిర్మూలించే పని చేస్తే దేశానికి మేలు చేస్తుందని రౌత్ చెప్పారు.

Read Also: UP Crime: “నన్ను ప్రేమించి వేరేవాడితో అక్రమ సంబంధం”.. ప్రియురాలి తలనరికి దారుణ హత్య..

బీహార్, ఏపీ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులు ఇద్దరూ అమిత్ షా రాజీనామా కోరాలని అన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై కూడా దాడి చేశారని, మోడీ ప్రభుత్వంలో మళ్లీ అమిత్ షా హోం మంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడిందని అన్నారు. దీనికి ముందు జమ్మూ కాశ్మీర్ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రాణాలు పోతున్నాయని, జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి బాధ్యులెవరని ఠాక్రే ప్రశ్నించారు. నేను దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని, ఎన్డీయే ప్రభుత్వ భవిష్యత్ గురించి కాదని అన్నారు.

ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. మంగళవారం కథువా, దోడా ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. రియాసి ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలకు చెందిన 11 టీమ్‌లు గాలిస్తున్నాయి.