NTV Telugu Site icon

Anant Ambani Wedding: వేదిక దగ్గర వ్యాపారవేత్త, యూట్యూబర్ హల్‌చల్.. కేసు నమోదు

Anant Ambani Wedding 3

Anant Ambani Wedding 3

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో శనివారం సాయంత్రం శుభ ఆశీర్వాద్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అతిరథ మహరథులంతా హాజరయ్యారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్రమంత్రులు, మొదలగు ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా లోపలికి ప్రవేశించిన ఒక వ్యాపారవేత్తను, యూట్యూబర్‌ను పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరికి ఆహ్వానం లేకుండానే వేదిక దగ్గర హడావుడి చేసినట్లుగా కనిపెట్టారు.

ఇది కూడా చదవండి: Viral Video: ఇండియన్ ఫుడ్ తిన్న మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ విక్రేత..ఆస్పత్రి పాలయ్యాడు..

పోలీసు అధికారుల ప్రకారం.. వేర్వేరు సందర్భాల్లో పట్టుబడిన నిందితులు ఇద్దరికీ ఆహ్వానాలు లేవని.. చట్టవిరుద్ధంగా ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. లుక్మాన్ మహ్మద్ షఫీ షేక్, వెంకటేష్ నర్సయ్య ఆలూరిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Anant Ambani Wedding: “శుభ్ ఆశీర్వాద్” వేడుకకు హాజరైన ప్రధాని మోడీ..