Union Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం భారతదేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోతుంది. సాధారణంగా ఫిబ్రవరి 1 ఆదివారం అంటే సెలవు రోజు.. కానీ, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అదే రోజు బడ్జెట్ 2026ను ప్రకటిస్తున్నందున, స్టాక్ మార్కెట్లు పని చేయాలని నిర్ణయించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రేపు (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత బడ్జెట్ పత్రాలను లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశ పెడతారు. ఇన్వెస్టర్లు బడ్జెట్ నిర్ణయాలకు అనుగుణంగా వెంటనే ట్రేడింగ్ చేసుకునే ఛాన్స్ కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)తో పాటు కమోడిటీ మార్కెట్లు కూడా ఆదివారం రోజు పూర్తి స్థాయిలో ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి. ఈక్విటీలు, డెరివేటివ్స్, కమోడిటీల ట్రేడింగ్ జరుగుతున్నాయి.
Read Also: Union Budget 2026: జీఎస్టీ మినహాయింపులు.. ఆటో రంగానికి బూస్ట్..
ట్రేడింగ్ సమయాలు:
* ప్రీ-ఓపెన్ సెషన్: ఉదయం 9:00 నుంచి 9:08 వరకు..
* నార్మల్ ట్రేడింగ్: ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30..
* బ్లాక్ డీల్ సెషన్ 1: ఉదయం 8:45 నుంచి 9:00..
* బ్లాక్ డీల్ సెషన్ 2: మధ్యాహ్నం 2:05 నుంచి 2:20..
* IPO, ఇతర ప్రత్యేక సెషన్లు: ఉదయం 9:00 నుంచి 9:45..
* మార్కెట్ ముగిసిన తర్వాత సెషన్: మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం 4:00 వరకు.
Read Also: Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్‌లో కీలక మార్పులు
* సెటిల్మెంట్: ఆదివారం రోజు మీరు చేసే ట్రేడింగ్ సెటిల్మెంట్ సోమవారం (ఫిబ్రవరి 2) నాడు మాత్రమే జరుగుతుంది. ఆదివారం హాలీడే కాబట్టి ఆరోజు సెటిల్మెంట్ జరగదు.
* డబ్బు విత్ డ్రా: ఆదివారం మీరు డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, కానీ ఆ డబ్బు మాత్రం సోమవారం నాడే మీ బ్యాంకు అకౌంట్ లో జమ అవుతుంది.
* షేర్ల అమ్మకం: జనవరి 30వ తేదీ శుక్రవారం నాడు కొన్న షేర్లను ఆదివారం అమ్మడానికి వీలు లేదు.. వాటిని సోమవారం నుంచి అమ్ముకునే అవకాశం ఉంటుంది.
* మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) కూడా ఆదివారం నాడు పని చేస్తుంది. బడ్జెట్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లతో ట్రేడింగ్ కొనసాగనుందని ఎంసీఎక్స్ వెల్లడించింది.
