Site icon NTV Telugu

BSF Jawan Released: పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల..

Brs

Brs

BSF Jawan Released: పాకిస్తాన్ రేంజర్లు గత నెల ఫిరోజ్‌పుర్‌ దగ్గర అదుపులోకి తీసుకొన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్ సాహూను ఎట్టకేలకు రిలీజ్ చేశారు. అతడిని ఈ రోజు ఉదయం పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద భారత దళాలకు అప్పగించినట్లు పీటీఐ పేర్కొంది. అయితే, బీఎస్‌ఎఫ్‌ 182వ బెటాలియన్‌కి చెందిన జవాన్ పూర్ణమ్‌.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో డ్యూటీ చేస్తున్నాడు. ఏప్రిల్‌ 23న సరిహద్దు దగ్గర కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కాస్త ఆనారోగ్యానికి గురయ్యారు. దీంతో సమీపంలో ఓ చెట్టు కనిపించడంతో దానికింద రెస్ట్ తీసుకున్నారు. అయితే, ఆ చెట్టు పాక్‌ భూభాగంలో ఉన్న విషయాన్ని గమనించలేకోపోయారు.

Read Also: Daggubati Purandeswari: బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం!

ఇక, సరిహద్దు దాటి రావడంతో పాకిస్తాన్ రేంజర్స్‌ బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ ను కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని విడుదల చేయాలని రెండు దేశాల భద్రతా దళాలు సుదీర్ఘ చర్చలు జరిపాయి. మరోవైపు జవాన్ పూర్ణమ్‌ ఫ్యామిలీ సైతం తీవ్రంగా ఆందోళన చెందింది. గర్భిణి అయిన అతడి భార్య.. భర్త విడుదల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంది. కొన్నాళ్లపాటు భారత్‌ అధికారుల అభ్యర్థనలు పట్టించుకోకుండా పాక్‌ రేంజర్లు కాలయాపన చేశారు. పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదంటూ సమాధానం చెప్పుకొచ్చారు.

Read Also: Republic of Balochistan: పాక్కి ఊహించని షాక్.. స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ

అయితే, ఈనెల మొదటివారంలో ఇండియన్ ఆర్మీ కూడా పాక్‌ రేంజర్‌ను అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ సమీపంలో ఉన్న భారత్‌-పాక్‌ సరిహద్దులోకి ఓ పాక్‌ రేంజర్‌ చొరబడి.. అనుమానాస్పదంగా కనిపించడంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అతడిని పట్టుకున్నారు. దీంతో వారిపై కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో జవాన్ పూర్ణమ్‌ను అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Exit mobile version