పేరు మారినా.. ఫేట్ మారలేదు..! యడ్డీకి జులై గండం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011 జులై 31న తన పదవికి రాజీనామా చేశారు. హైకమాండ్ ఆదేశాలతో తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది యడియురప్పకు..! అయితే సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ ఆ సీన్ రిపీటైంది. ఆపరేషన్ కమల్ పేరుతో వ్యూహాలకు పదును పెట్టిన యడియురప్ప.. కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్‌ను కూల్చడంలో.. బీజేపీని తిరిగి అధికారం కట్టబెట్టడంలో కీలక వ్యవహారించారు. 2019లో సీఎంగా మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ సీన్ మొదటికి వచ్చింది. 2021 జులై 26న హైకమాండ్ ఆదేశాలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఈ రెండు సందర్భాలు జులై నెలలో జరిగాయి. రెండు సార్లు హైకమాండ్ ఒత్తిడితోనే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో యడియురప్పకు జులై నెల కలిసి రాలేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇదే కాదు.. కలిసివచ్చే కాలం కోసం గతంలో ఆయన తన పేరును మార్చుకున్నారు. పేరు మారినా.. యడియురప్ప ఫేట్ మాత్రం మారలేదు. ఆయన నాలుగుసార్లు సీఎం పగ్గాలు చేపట్టినా.. ఏనాడు ఐదేళ్ల పాటు కూర్చీలో కూర్చోలేకపోయారు. మొదటిసారి ఏడు రోజులు.. రెండోసారి మూడేళ్లు.. మూడోసారి కేవలం రెండంటే.. రెండే రోజులు ఆయన సీఎం పదవిలో ఉన్నారు. అయితే నాలుగోసారి కథ మారుతుందని భావించినా.. ఏజ్ బార్ అయిందంటూ హైకమాండ్ తప్పుకోమని చెప్పింది. దీంతో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన రోజే.. సీఎం పదవికి రాజీనామా చేశారు. మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన యడ్డీకి.. కాలం మాత్రం కలిసి రావడం లేదు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!