NTV Telugu Site icon

BRS MPs: అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం

Brs Mp

Brs Mp

BRS MPs: అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని బీఆర్‌ఎస్‌ ఎంపీలు అన్నారు. స్పీకర్ పోడియంను BRS ఎంపీలు చుట్టుముట్టారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని లోక్ సభలో ఆందోళనలు మిన్నంటాయి. దీంతో కాసేపు లోక్‌ సభ ఆందోళనతో దద్దరిల్లింది.

ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఆధాని షేర్ల అంశంపై నోటీస్ ఇచ్చామన్నారు. దేశ సమస్య పై చర్చ జరగాలి అని కోరామన్నారు. పబ్లిక్ మని ఇన్వాల్వ్ ఉందని తెలిపారు. చర్చ లేకుండా వెనక్కి వెళ్ళారని అన్నారు. ఏ సమస్య పై అయినా చర్చకు సిద్దం అంటారు.. కానీ చర్చించారన్నారు. Lic డబ్బుపై ఇంత జరుగుతున్నా, ప్రభుత్వ ప్రకటన లేదని మండిపడ్డారు. పార్లమెంట్ లో చర్చకు ముందుకు రావటం లేదని ఆరోపించారు. దేశ సమస్యపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. చర్చ జరిగేందుకు మా పోరాటం కొనసాగుతోందని అన్నారు.

Read also: Butcher Son: తల్లిని రోకలిబండతో కొట్టిచంపిన కొడుకు.. అలా చేసేందుకు ప్లాన్‌ వేశాడు

బీఆర్‌ఎస్‌ ఎంపీ కే. కేశవ రావు మాట్లాడుతూ.. నోటీసులు రాజ్యసభలో వాయిదా తీర్మానాలుగా ఇచ్చామన్నారు. అదాని సంస్థల్లో లక్షల కోట్లు పెట్టుబడులు కావడం, షేర్ల విలువ పడిపోవడంపై దర్యాప్తు జరపాలన్నారు. సభ ఆర్డర్ లో లేదని వాయిదా వేశారని అన్నారు. ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన చాలా సీరియస్ అంశమన్నారు. అదాని షేర్స్ 27 శాతం పడిపోయాయని, అదాని షేర్స్ వ్యవహారం పై జెపిసి లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని తెలిపారు. క్రోని కేపిటలిజం దేశాన్ని రూల్ చేస్తుందని అన్నారు. వ్యాపారస్తులు ప్రభుత్వ స్నేహితులుగా ఉన్నారు.. అందుకే ప్రభుత్వం స్పందించడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వాయిదా తీర్మానానికి ఉన్న విలువ దేనికి లేదని అన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలిపారు. ప్రధాని మోడీ ముడుపులు కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మోడీ చెప్పేది ధర్మశాస్త్రాలు, Lic తో లింక్ లేని కుటుంబాలు లేవన్నారు.
గుజరాతీ వ్యాపారస్తుల కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అధానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. 28 రాష్ట్రాల్లో అసెంబ్లీ, కౌన్సిల్ లో తీర్మానాలు, అన్ని రాష్ట్రాలను కూడగట్టుకుని పోరాటం చేస్తామన్నారు. జుడిషియల్ ఎంక్వయిరీ, లేదా జేపీసీ వేసి విచారణ జరపాలన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామన్నారు.
Moldy Brownies: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. నలుగురికి మెమోలు జారీ చేసిన ఈఓ..

Show comments