NTV Telugu Site icon

Kavitha: లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్.. విచారణ ఎప్పుడంటే..!

Kavitha

Kavitha

లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ శుక్రవారం ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యారు. తాజాగా సుప్రీంకోర్టుపై కవిత ఆశలు పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: MLC Duvvada Srinivas House: ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్‌..

ఇదిలా ఉంటే ఇదే కేసులో గతేడాది ఫిబ్రవరిలో అరెస్టైన మనీష్ సిసోడియాకు శుక్రవారమే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 17 నెలల తర్వాత ఆయనకు విముక్తి లభించింది. సిసోడియాకు బెయిల్ మంజూరు కావడంతో కవిత కూడా బెయిల్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే కవిత సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్‌‌చాట్ చేస్తూ.. కవితకు నెక్ట్స్ వీక్ బెయిల్ వస్తుందని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Anurag Thakur: “గాజా గురించి మాట్లాడే రాహుల్ గాంధీ బంగ్లా హిందువులపై మౌనం ఎందుకు.?”

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఆమె నివాసంలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఢిల్లీ తీహార్ జైలుకు తరలించారు. పలు మార్లు బెయిల్ పిటిషన్లు వేసినా.. బెయిల్ లభించలేదు. తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. సోమవారం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Minister Nimmala Ramanaidu: కలలో కూడా వారికి రెడ్ బుక్ గుర్తుకు వస్తుంది.. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా..!

Show comments