Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Broken Relationships Dont Amount To Abetment Of Suicide Supreme Court

Supreme Court: “రిలేషన్‌షిప్ చెడిపోవడం ఆత్మహత్యను ప్రేరేపించదు..”

Published Date :November 29, 2024 , 6:05 pm
By Venu Goapl Reddy
  • రిలేషన్‌షిప్ చెడిపోవడం ఆత్మహత్యని ప్రేరేపించదు..
  • సంబంధాలు విడిపోవడం మానసిక బాధకు కారణం..
Supreme Court: “రిలేషన్‌షిప్ చెడిపోవడం ఆత్మహత్యను ప్రేరేపించదు..”
  • Follow Us :
  • google news
  • dailyhunt

Supreme Court: సంబంధాలు విచ్ఛన్నం కావడం మానసిక వేదనకు గురిచేస్తున్నప్పటికీ, నేరపూరిత నేరానికి దారితీసే ఉద్దేశం, ఆత్మహత్యలకు ప్రేరేపించదని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఐపీసీ కింద మోసం, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరాలకు కర్ణాటక హైకోర్ట్ కమరుద్దీన్ దస్తగిర్ సనాదికి విధించిన శిక్షను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ పంకజ్ మిథాల్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ‘‘ఈ కేసు రిలేషన్ షిప్ బ్రేక్ గురించి, నేరప్రవర్తనకు సంబంధించింది కాదు’’ అని తీర్పులో పేర్కొంది.

సనాదిపై తొలుత IPC సెక్షన్లు 417 (మోసం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 376 (అత్యాచారం) కింద అభియోగాలు మోపారు. ట్రయల్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించగా, కర్ణాటక హైకోర్టు మోసం, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారించింది. అతడికి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25,000 జరిమానా విధించింది. కేసు వివరాలను పరిశీలిస్తే, 21 ఏళ్ల తన కుమార్తె 8 ఏళ్ల పాటు నిందితుడితో ప్రేమలో ఉందని, వివాహం చేసుకుంటానని నమ్మించి మాటనిలబెట్టుకోలేదని, దీంతో ఆగస్టు 2007న తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి ఫిర్యాదు చేసింది.

Read Also: Bangladesh: మరీ ఇంత దారుణమా? ఆలయాలపై దాడులు.. హిందువులను ఊచకోత కోస్తున్నారు!(వీడియోలు)

జస్టిస్ మిథాల్ 17 పేజీల తీర్పును రాశారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఆరోపణ లేదా ఆత్మహత్యకు దారి తీసే ఉద్దేశపూర్వక చర్యలు ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు. అందువల్ల సంబంధాలు చెడిపోవడం మానసిక బాధని కలిగించేవిగా ఉంటాయి, కానీ ఆత్మహత్యలకు ప్రేరేపించడంగా పరిగణించలేము అని కోర్టు చెప్పింది.

‘‘బాధితురాలు ఆమె పట్ల జరిగిన క్రూరత్వం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. సమాజంతో అసమ్మతి, వైరుధ్యాలు చాలా సాధారణమని, దీని వల్ల ఇలాంటి నేరం ఎక్కువ జరుగుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. బాధితురాలి మానసిక స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఖచ్చితంగా నిందితుడి నేరపూరిత ఉద్దేశ్యం నిర్ధారింబడే వరకు సెక్షన్ 306 ఐపీసీ ప్రకారం అతడిని దోషిగా నిర్ధారించడం సాధ్యం కాదని, నిందితుడు మహిళని ఆత్మహత్యు ప్రేరేపించాడనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని తీర్పులో చెప్పింది. సుదీర్ఘ సంబంధం తర్వాత కూడా వివాహానికి నిరాకరిస్తే అది ఆత్మహత్యకు ప్రేరేపణ కాదని చెప్పింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abetment Of Suicide
  • Law News
  • Relationships
  • Supreme Court

తాజావార్తలు

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions