NTV Telugu Site icon

Bride Ride In The Metro: పెళ్లి కూతురు స్మార్ట్‌ ఛాయిస్.. వైరల్‌గా మారిపోయింది..

Bride

Bride

Bride Ride In The Metro: ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తోంది.. ఇదో సంస్థ వాణిజ్య ప్రకటన కావొచ్చు.. కానీ, కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌గా ఆలోచిస్తే.. ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు అంటోంది ఓ పెళ్లి కూతురు.. బెంగళూరు, కర్ణాటక రాష్ట్ర రాజధాని మరియు దేశంలోని స్టార్టప్ సిటీ, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ రెండు విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఒకటి ఇక్కడి వాతావరణం, రెండోది ట్రాఫిక్‌ జామ్… అసలు ట్రాఫిక్‌ జామ్ విషయం ఏమిటంటే, విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకునే సమయం కంటే.. విమానాశ్రయం నుంచి ఇంటికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందట.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది… ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి ఓ వధువు బుర్రకు అద్భుతమైన ఐడియా తట్టింది.. అదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చకు కారణమైంది..

Read Also: CI Muthu Yadav: లోకో పైలెట్ మిస్సింగ్.. అందువల్లే ఆచూకీ తెలియలేదన్న సీఐ

అసలే ముహూర్తం సమయం ముంచుకొస్తుంది.. వధువు ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.. అప్పుడే స్మార్ట్‌గా ఆలోచించింది వధువు.. కారును వదిలే.. మెట్రో రైల్‌ ఎక్కింది.. సరైన సమయానికి మండపానికి చేరుకుంది.. పెళ్లికి ఎన్ని ఏర్పాట్లు చేసినా.. కొన్ని చివరికి మూడ్ పాడు చేసే ఘటనలు చోటు చేసుకుంటాయి.. పెళ్లికి వచ్చేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఆలస్యంగానైనా చేరుకుంటారేమో.. కానీ, పెళ్లి చేసుకోవాల్సినవారే ట్రాఫిక్‌లో చిక్కుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది.. మొత్తంగా ట్రాఫిక్‌ జామ్‌తో తన పెళ్లికి ఆలస్యంగా కాకుండా.. మెట్రో రైల్‌ ఎక్కి మండపానికి చేరుకుంది.. నగలు ధరించిన నవ వధువు.. మెట్రోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఆ యువతిని చూసి అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు గందరగోళానికి గురయ్యారు.. కానీ, వధువు దీని గురించి ఏమీ పట్టించుకోకుండా.. మెట్రోలో తన గమ్యాన్ని చేరుకోవడానికి బయలుదేరింది. ఆమె సానుకూలత అందరి హృదయాలను గెలుచుకుంది. ఇక, ఈ వీడియో @peakbengaluru అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది. ఈ వీడియోతో అతను వాట్ స్టార్ !! భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి, స్మార్ట్ బెంగళూరు పెళ్లికూతురు తన కారును వదిలి, పెళ్లి ముహూర్త సమయానికి ముందు తన పెళ్లి మండపానికి చేరుకోవడానికి మెట్రో ఎక్కింది!! అని వీడియో షేర్‌ చేశారు.. ఇప్పటికే ఆ వీడియో 4.8 వేల మందికి పైగా నెటిజన్లు చూశారు.. పెళ్లి కూతురు ఐడియాకు ఫిదా అయిపోతున్నారు.