NTV Telugu Site icon

BRICS Summit 2024: నేటి నుంచి రష్యాలో బ్రిక్స్‌ సమ్మిట్.. ప్రధాని మోడీతో పుతిన్ కీలక భేటీ

BRICS Summit 2024: ‘బ్రిక్స్‌’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు (మంగళవారం) ప్రారంభం కానుంది. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమానికి రష్యాలోని కజన్‌ వేదికగా స్టార్ట్ కానుంది. ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడమే ఈ ఏడాది సమ్మిట్ యొక్క ప్రధాన నినాదం. ఇందులో మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సదస్సుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర దేశాల నేతలు పాల్గొంటారు.

Read Also: Coolie : సూపర్ స్టార్ రజనీ ఈజ్ బ్యాక్…

ఇక, బాత్రూమ్‌లో పడి తలకు గాయం కావడంతో బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా.. బ్రిక్స్‌ సమావేశానికి దూరంగా ఉంటున్నారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతారని అధికారులు వెల్లడించింది. అయితే, బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్‌ కూటమి ఏర్పడింది. ఇప్పుడు దాన్ని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ ఈ కూటమిలో సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత తొలి శిఖరాగ్ర సమ్మిట్ ఇదే.

Read Also: Pottel : ‘పొట్టేల్’ కచ్చితంగా కొట్టేస్తుంది.. సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెంట్!

కాగా, ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి భారతదేశం- రష్యా వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ఉక్రెయిన్ తదితర ప్రపంచ అంశాలపై కూలంకషంగా ఇరువురు చర్చించనున్నారు. యుద్ధంతో సమస్యలను పరిష్కరించలేమని మోడీ- పుతిన్‌తో గత పర్యటనలోనే చెప్పారు. అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుస్తామని మోడీ పుతిన్‌కు హామీ ఇచ్చారు. అయితే, ప్రధాని మోడీ రష్యా పర్యటన చేపట్టడం ఈ ఏడాదిలోనే ఇది సెకండ్ టైం. బ్రిక్స్‌ సదస్సులో పలువురు దేశాధినేతలతో నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు.