Tamil Nadu: ప్రియురాలు పదే పదే ఆ ప్రస్తావన తేవడంతో ప్రియుడు ఏం చేశాడంటే..!
- తమిళనాడులో ఘోరం
- ప్రియురాలిని చంపిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలు పదే పదే పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. పొలంలోకి పిలిచి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దారుణం ఈరోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు అరటి తోటలో జరిగింది.
సోనియా అప్పకుడల్ పట్టణానికి చెందిన బ్యూటీషియన్. భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి దగ్గర ఉంటుంది. రెండేళ్ల క్రితం గోబిచెట్టిపాళయం సమీపంలోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నప్పుడు బీకాం గ్రాడ్యుయేట్ మోహన్ కుమార్(27)తో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారి తీసింది. మోహన్‌కుమార్‌కు అరటి తోట కూడా ఉంది. అయితే నవంబర్ 2 నుంచి సోనియా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో పొలాల్లో స్థానికులు పుట్టగొడుగులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రక్తపు మరకలు ఉన్న కత్తి, మట్టిలో మహిళ వెంట్రుకలు బయటకు కనిపించాయి. దాదాపు మూడు అడుగుల గుంతలో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో హత్య వెలుగులోకి వచ్చింది.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ఇది కూడా చదవండి: India-Afghanistan: బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం.. ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
ఇక పోలీసులు సంఘటనాస్థలికి వచ్చి పొలంలో మృతదేహం వెలికితీస్తున్న క్రమంలో మోహన్ కుమార్ కూడా అక్కడే ఉన్నాడు. ఏమీ ఎరగనట్టుగా నటిస్తూ కనిపించాడు. దీంతో ఫోన్ కాల్స్ తనిఖీ చేయగా మోహన్‌కుమార్‌తో సంబంధం ఉన్నట్లుగా తేలింది. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. పదే పదే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో చంపేసినట్లుగా ఒప్పుకున్నాడు.
ఇది కూడా చదవండి: Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
సోనియా-మోహన్ కుమార్ రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకోవాలని విసిగించడంతోనే చంపేశాడని పోలీసులు తెలిపారు. ఎక్కువ సార్లు వ్యవసాయ భూమిలోనే ఇద్దరూ కలుసుకునేవారిని చెప్పారు. నేరం జరిగిన రోజు మోహన్ కుమార్ రాత్రి 8గంటల ప్రాంతంలో ఒక గొయ్యి తవ్వాడని.. అనంతరం సోనియాను పిలిచి ఆమెతో గడిపిన తర్వాత రాయితో దాడి చేసి కత్తితో పొడిచి చంపేసినట్లు తెలిపారు. అటు తర్వాత మృతదేహాన్ని గోతిలో పాతిపెట్టేసి.. ఫోన్, దుస్తులు భవానీ కాలువ దగ్గర పడేసి వెళ్లిపోయాడని వివరించారు.
సిరువలూరు పోలీస్ స్టేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పెరుండురై ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య బృందం సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు. మోహన్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యా్ప్తు జరుగుతోందని వెల్లడించారు.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి