Boyfriend Burnt Girlfriend: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ప్రియుడు. ఈదారుణమైన ఘటన దేశం ఉలిక్కిపడేలా చేసింది.
దుమ్కా జిల్లా బాల్కీ గ్రామానికి చెందిన ఓ యువతికి మహేశ్‌పుర్ కు చెందిన రాజేశ్ అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్న సమయంలో.. రాజేశ్ తల్లిదండ్రులు మరొకరితో 2022లో వివాహం జరిపించారు. రాజేశ్ కూడా అప్పుడు తల ఆడించి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రేమ వ్యవహారంలో వున్న యువతిని కుటుంబ సభ్యులు కూడా వేరొకనితో పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. రాజేశ్ మళ్లీ ఎంట్రీ ఇచ్చి ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటా అంటూ వెంటపడ్డాడు. దీంతో ఆ యువతి నిరాకరించింది. ప్రేమించిన యువతిని రాజేశ్ తననే పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని చెదిరించాడు.
అయినా ఆయువతి పెళ్లికి నిరాకరించింది. తన తల్లిదండ్రులు చెప్పిన యువకుడినే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. దీంతో రాజేశ్ క్రూరమృగంలా మారాడు. ఆయువతిని చంపేసేందుకు పథకం వేశాడు. ఎవరు లేని సమయంలో ఇంటికి వెళ్లాడు నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడనుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయువతి ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
Sri Venkateswara Swamy Stotra Parayanam Live: ఈ రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శ్రీనివాసుని కృపతో అప్పులు తీరిపోతాయి