NTV Telugu Site icon

SpiceJet Flight: ఢిల్లీ-పూణే స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు

Spicejet

Spicejet

Bomb threats to Spice Jet flight: ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు విమానాన్ని క్షణ్ణంగా సోదా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. అధికారుల సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు. బాంబు బెదిరింపులతో ప్రయాణికుల బోర్డింగ్ ను ఆపి బాంబు స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారు.

Read Also: Covid 19: వ్యాక్సిన్ కోసం చైనీయుల పాట్లు.. హాంకాంగ్‌కు పరుగులు..

రెండు రోజుల ముందు మాస్కో-గోవా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే ఎదురయ్యాయి. అంజూర్ ఎయిర్ విమానంలో బాంబు ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈ మెయిల్ రావడంతో విమానాన్ని గుజరాత్ జామ్ నగర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్వ్కాడ్, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేశారు. మొత్తం 244 మంది ప్రయాణికులను కిందికి దించి తనిఖీలు చేశారు. అయితే ఇది ఫేక్ కాల్ గా తరువాత అధికారులు గుర్తించారు. ఆ తరువాత విమానం గమ్యస్థానానికి చేరుకుంది.