దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. పలు పాఠశాలలకు శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తెల్లవారుజామున ఈ బెదిరింపులు రావడంతో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. బాంబ్ బెదిరింపులు కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తనిఖీలు కారణంగా ద్వారక ఢిల్లీ పబ్లి్క్ స్కూల్‌లో మిడ్-టర్మ్ పరీక్షలను రద్దు చేశారు. అలాగే కృష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయంలో ప్రస్తుతం పోలీసులు సోదాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక
ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు పంపి పాఠశాల ప్రాంగణాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు కారణంగా ఈరోజు జరగాల్సిన పరీక్షలను రద్దు చేసినట్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. స్కూల్‌కు వచ్చిన వారందరిని తిరిగి ఇంటికి పంపేశారు.
ఇది కూడా చదవండి: Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీలో రష్మిక ఎంట్రీ..
దేశంలో ప్రధాన పట్టణాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులో వరుసగా బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ప్రధానంగా పాఠశాలలే లక్ష్యంగా బెదిరింపులు వస్తున్నాయి. ఢిల్లీలో అయితే ప్రతి వారం ఇదొక తంతు అవుతోంది. ఈ మధ్య మెయిల్స్ ద్వారా బెదిరింపులు రాగా.. తాజాగా ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు. ఇంకోవైపు పోలీసులు కూడా ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Multiple schools in Delhi received bomb threat calls today. Among those targeted were DPS Dwarka, Krishna Model Public School and Sarvodaya Vidyalaya. Police teams, along with bomb disposal squads, were rushed to the schools. Students and staff were safely evacuated as… pic.twitter.com/LxaF1fPpN1
— ANI (@ANI) September 20, 2025
