Site icon NTV Telugu

Mumbai: కోటి మందిని చంపేస్తాం.. నిమజ్జనం వేళ ముంబైకు బాంబ్ బెదిరింపులు

Mumbai

Mumbai

గణేష్ నిమజ్జనం వేళ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ బాంబ్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 34 వాహనాల్లో ఆర్డీఎక్స్‌ పెట్టినట్లుగా వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు వచ్చింది. ఒక కోటి మంది ప్రజలను చంపబోతున్నట్లు సందేశం వచ్చింది. దీంతో పోలీస్ శాఖ సీరియస్‌‌గా తీసుకుని అప్రమత్తమైంది.

ఇది కూడా చదవండి: Trump: యుద్ధాలపై ట్రంప్ కొత్త పలుకు.. ఎన్ని ఆపారో సంఖ్య చెప్పిన అధ్యక్షుడు

ముంబైలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని.. 400 కిలోల ఆర్డీఎక్స్‌ను నగరంలో పలు వాహనాల్లో అమర్చారని బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం వచ్చిన బెదిరింపు సందేశంతో అలర్ట్‌గా ఉన్నట్లు అధికారి చెప్పారు.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!

ఇక బెదిరింపుపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. ఉగ్రవాద నిరోధక దళం (ATS), ఇతర సంస్థలకు కూడా సమాచారం అందించినట్లు అధికారి తెలిపారు. బెదిరింపు సందేశంలో ‘లష్కర్-ఎ-జిహాదీ’ అనే సంస్థ పేరును పంపించినట్లు అధికారి వెల్లడించారు. శనివారం ముంబైలో భారీగా నిమజ్జనాలు ఉన్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు

ఇక ముంబై వాసులు పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే వెంటనే తెలియజేయాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

 

Exit mobile version