Site icon NTV Telugu

Ahmedabad Tragedy: భారతదేశ వ్యాప్తంగా బోయింగ్ 787-8 విమానాలు నిలిపివేత..?

Boeing Dreamliner 787 8

Boeing Dreamliner 787 8

Ahmedabad Tragedy: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన 35 సెకన్లలోనే కుప్పకూలింది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలకు పేరుగాంచిన డ్రీమ్ లైనర్ ఇలా కూలిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Read Also: Kommineni Srinivasa Rao: కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్.. కీలక ఆదేశాలు

ఇదిలా ఉంటే, ఈ ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాలను గ్రౌండింగ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బోయింగ్ సంస్థకు చెందిన ఈ విమానాల భద్రతా సమీక్ష కోసం అన్ని విమానాలను నిలిపేయవచ్చని సంబంధిత వర్గాలు శుక్రవారం తెలిపాయి. అయితే, ప్రమాదంపై దర్యాప్తు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే కాకుండా, ఎయిర్ ఇండియా విమాన నిర్వహణపై దాని స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానంపై కూడా పరిశీలన ఎదుర్కోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు చెప్పారు.

గురువారం, లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం – బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని సెకన్ల తర్వాత కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు మరియు సిబ్బందిలో ఒకరు మాత్రమే ప్రమాదం నుండి బయటపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎత్తును కోల్పోయిందని అధికారులు తెలిపారు. మేఘనినగర్ ప్రాంతంలోని బిజె మెడికల్ కాలేజీ డాక్టర్స్ హాస్టల్స్ పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది మెడికోలు కూడా చనిపోయారు. ఇంజన్లకు కావాల్సిన థ్రస్ట్ రాకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Exit mobile version