NTV Telugu Site icon

Khushbu Sundar: సినీనటి ఖుష్బూకు కీలక పదవి.. మోదీకి థాంక్స్ చెబుతూ ట్వీట్..

Khushbu

Khushbu

Khushbu Sundar: ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి లభించింది. జాతీయ మహిళా కమిషన్( ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా ఆమెను కేంద్రం నామినేట్ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరిని నామినేట్ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యురాలు అయిన ఖుష్బూ తన నియామక పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె నియామకంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అభినందనలు తెలిపారు. ఆమె నియామకం ‘‘మహిళ హక్కుల కోసం ఆమె అలుపులేని పోరాటానికి’’ గుర్తింపుగా అభివర్ణించారు.

Read Also: Gun Fire: రాజధానిలో గన్ ఫైర్.. తుపాకీతో కాల్చుకున్న అక్బరుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు

ఖుష్బూ తన నియామకంపై ప్రధాని నరేంద్రమోదీకి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇంతపెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు మా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జీకి, భారత ప్రభుత్వానికి థాంక్స్ తెలుపుతున్నాను. మీ నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న నారీ శక్తని రక్షించడానికి, సంరక్షించడానికి నేను కృషి చేస్తాను’’ అంటూ ట్వీట్ చేశారు.

తమిళనాడులో అన్నామలై సారధ్యంలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలపడుతోంది. ఈ నేపథ్యంలో తమిళ నాయకురాలిగా గుర్తింపు పొందిన ఖుష్బూను ఎన్సీడబ్ల్యూ మెంబర్ గా చేసింది బీజేపీ ప్రభుత్వం. సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్ అయిన ఖుష్బూ మొదట్లో డీఎంకే పార్టీలో చేరారు. ఆ తరువాత కాంగ్రెస్ లోకి మారారు. దీని తర్వాత బీజేపీలో చేరి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే నాయకుడు ఎన్ ఎజిలన్ చేతిలో ఓడిపోయారు.