NTV Telugu Site icon

Pune: ప్రధాని మోడీకి గుడి కట్టిన బీజేపీ కార్యకర్త మనస్తాపం.. బీజేపీకి గుడ్‌బై

Pune

Pune

ప్రధాని మోడీ భక్తుడు, బీజేపీ వీర విధేయుడు మయూర్ ముండే మనస్తాపం చెందాడు. మోడీపై ఉన్న అభిమానంతో రూ.1.5లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే స్థానిక బీజేపీ నేతల తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు. దీంతో మయూర్ ముండే కమలం పార్టీకి గుడ్‌బై చెప్పాడు.

ఇది కూడా చదవండి: Hibox Scam: పెట్టుబడి పేరుతో రూ. 500కోట్ల మోసం.. యాప్ ప్రమోట్ చేసిన యూట్యూబర్, నటికి సమన్లు

2021లో పూణెలోని ఔంధ్‌లో ప్రధాని మోడీకి మయూర్ ముండే ఆలయాన్ని నిర్మించాడు. జైపూర్ నుంచి తీసుకొచ్చిన ఎర్ర రాయి, పాలరాయితో ఈ గుడిని నిర్మించాడు. భద్రతా కోసం టఫ్‌న్డ్ గ్లాస్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఆలయ నిర్మాణానికి రూ. 1.5 లక్షలు ఖర్చైంది. ఈ గుడిని ప్రధాని మోడీకి అంకితం చేశాడు. మోడీపై ఉన్న అభిమానంతో గౌరవ చిహ్నంగా ఆలయాన్ని నిర్మించినట్లు ముండే తెలిపాడు. మోడీని తాను ఆరాధిస్తానని చెప్పాడు. ఇతరులు కూడా ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటారన్నారు. ఈ వార్త బీజేపీ జాతీయ నాయకులు చేరింది. నిర్మాణాన్ని తొలగించమని చెప్పారన్నారు. దీంతో మోడీ ప్రతిమను ఆలయం నుంచి తొలగించారు.

ఇది కూడా చదవండి: Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు..

ఇక తాజాగా స్థానిక నాయకులు.. పార్టీ విధేయులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ముండే వాపోయాడు. దీంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మోడీ, అమిత్ షా, నడ్డాకు లేఖ రాశాడు. ‘‘నేను బీజేపీకి నమ్మకమైన కార్యకర్తగా ఉన్నాను. ఔంధ్ వార్డు చీఫ్ నుంచి శివాజీనగర్ యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ వరకు నేను పార్టీ కోసం అంకితభావంతో పనిచేశాను. అయితే ఇటీవలి కాలంలో బయటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ విధేయులు విస్మరించారు’’ అని ముండే లేఖలో పేర్కొ్న్నాడు.

ఇది కూడా చదవండి: Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పరువు నష్టం దావా?