NTV Telugu Site icon

P. Chidambaram: రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ వెనకాడదు..

Chidambaram

Chidambaram

P. Chidambaram: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు కాషాయ పార్టీ ఏమాత్రం వెనకాడదన్నారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాజ్యాంగం ప్రమాదంలో పడింది.. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అడిగిన ప్రశ్నకు పి. చిదంబరం రియాక్ట్ అయ్యారు. రాజ్యాంగంలో బీజేపీ కచ్చితంగా సవరణలు చేస్తుంది. అందుకోసం వారు ట్రై చేస్తున్నారు.. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు విఘాతం కలిగిస్తుందని ఆయన ఆరోపించారు.

Read Also: Vanga Geetha: అప్పుడే జగన్‌ డిక్లరేషన్‌ ఇస్తారు-మాజీ ఎంపీ వంగా గీత..

కాగా, డిజిటల్‌ లావాదేవీలు భారత్‌ సాధించిన పురోగతిని ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అభినందించారు. నగదు అవసరం లేకుండా డిజిటల్‌ విధానంలో పేమెంట్లు కొనసాగుతున్నాయి. ఇది అభినందించదగిన విషయం.. అయితే, జర్మనీ, యూరప్‌లలో పూర్తిగా నగదురహిత సమాజం ఏర్పడలేదు అనే విషయాన్ని గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన నాటికి రూ.16-17 లక్షల కోట్లు చెలామణిలో నగదు ఉంది.. నేడు అది రూ. 34 లక్షల కోట్లకు చేరిపోయిందన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డిజిటల్‌ పేమెంట్‌కు బదులు.. ప్రజలు నగదును వినియోగిస్తున్నారని చెప్పారు. దాన్ని వారి దగ్గర నుంచి దూరం చేయలేమని చిదంబరం పేర్కొన్నారు.