NTV Telugu Site icon

Madhya Pradesh: ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ.. కమల్‌నాథ్ ఇలాకాలో బీజేపీ ఘన విజయం

Bjp

Bjp

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి నుంచే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. కర్ణాటకలో గెలిచిన ఊపులో మధ్యప్రదేశ్ లో కూడా గెలవాలని కాంగ్రెస్ భావిస్తుంది. గత నాలుగు పర్యాయాలుగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ మరోసారి గెలిచి 2024 లోక్ సభ ఎన్నికల ముందు తమ సత్తా చాటాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి.

Read Also: Viral News: విమానంలోకి పెద్ద పక్షి.. ఫైలట్ ముఖం నిండా రక్తం.. అయినా సరే..!

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. మాజీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత సొంత ప్రాంతంలో బీజేపీ ఘన విజయాన్ని దక్కించుకుంది. చింధ్వారా నియోజకవర్గంలోని లోకల్ బాడీకి జరిగిన బైపోల్ లో ఒక వార్డును బీజేపీ దక్కించుకోవడంతో పాటు మొత్తంగా 13 స్థానిక సంస్థలకు ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ మొత్తం ఏడుగురు కార్పొరేటర్లను గెలిపించుకుంది. కాంగ్రెస్ ఆరింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.

చింధ్వారా మున్సిపల్ కార్పొరేషన్ లోని 42 వార్డుకు జరిగిన బైపోల్ లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. చింధ్వారా మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కంచుకోటగా ఉంది. ఈ వార్డులో బీజేపీ అభ్యర్థి సందీప్ సింగ్ చౌహాన్ 436 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర స్వామిని ఓడించారు. ఈ గెలుపుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణుదల్ హర్షం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు పెద్దపీట వేశారని అనన్ారు. కమల్ నాథ్, అతని కొడుకు ఎంపీ అయిన నకుల్ నాథ్ ఇద్దరూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోవడానికి ప్రచారం చేశారని.. అయినా బీజేపీ విజయం సాధించి చరిత్ర సృష్టించిందని అన్నారు.