Site icon NTV Telugu

Chandigarh Mayor Election: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్‌కు బిగ్ షాక్.. బీజేపీ జయకేతనం

Bjp

Bjp

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌‌లకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలను ఓడించి బీజేపీ ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి సౌరభ్ జోషికి మొత్తం 18 ఓట్లు రాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి యోగేష్ ధింగ్రాకు కేవలం 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ గబీకి ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ ఓట్లు కలిపి 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలను గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ మధ్య సఖ్యత చెడిపోవడంతో కమలం పార్టీకి విజయం సునాయాసం అయింది.

ఇది కూడా చదవండి: PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ఈయూ డీల్‌ను మరోసారి ప్రశంసించిన మోడీ

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. గతంలో ఆప్-కాంగ్రెస్ కలిసి ఉన్నప్పుడు ఈజీగా మేయర్ పదవిని దక్కించుకుంది. అయితే విభేదాలు రావడంతో విడివిడిగా పోటీ చేశాయి. దీంతో బీజేపీ మేయర్ పదవిని దక్కించుకుంది. మొదటిసారిగా మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. కౌన్సిలర్లు చేతులెత్తి మేయర్ ఎన్నుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి సౌరభ్ జోషికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Ajit Pawar Plae Crash: ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నా’’.. కో-పైలట్ చివరి మాటలు

Exit mobile version