Goa Results: గోవాలో బీజేపీ హ్యాట్రిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవాలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యింది భారతీయ జనతా పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ స్థానాలకు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయినా.. స్వతంత్రుల మద్దతుతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు రెడీ అయిపోయింది.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 20 స్థానాల్లో.. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో, టీఎంసీ 2, ఆమ్ఆద్మీ పార్టీ 2, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు..
Read Also: Vani Viswanath: నగరిలో దిగిన మరో సినీ స్టార్.. రోజాపై పోటీకి సై..!
Also Read
బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో.. ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు స్వతంత్ర అభ్యర్థులు. బిచోలిమ్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్చంద్రకాంత్ శెట్టి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇక, కొర్టాలిమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అలెక్జియో రెజినాల్డో కూడా బీజేపీకే జై కొట్టారు.. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మార్గం సుగమం అయ్యింది. ఇక, మరోసారి గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి ప్రమోద్‌సావంత్. పార్టీ కార్యకర్తల కృషితోనే ఈ ఎన్నికల్లో విజయం సాధ్యమైందన్న ఆయన.. గోవాలో బీజేపీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.. కాగా, సాంకేలిమ్స్థానం నుంచి పోటీ చేసిన సావంత్..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 650 ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!