BJP vs Congress: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతోంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పోరు కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఈసారి రోహిత్ సేన వరల్డ్ కప్ తీసుకురావాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు సెలబ్రిటీలు టీం ఇండియాకు విషెస్ తెలుపుతున్నారు.
Read Also: World Cup final: ఫైనల్ మ్యాచ్‌లో కలకలం.. “ఫ్రీ పాలస్తీనా” టీషర్ట్ ధరించి దూసుకొచ్చిన వ్యక్తి..
ఇదిలా ఉంటే హై ఓల్టేజ్ ఫైట్ నేపథ్యంలో క్రికెట్‌ని ప్రస్తావిస్తూ.. పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ మ్యాచును ద్వారా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. బీజేపీ తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఇండియన్ టీంకి శుభాకాంక్షలు తెలుపుతూ..‘‘ కమాన్ టీం ఇండియా’’ అని పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్టును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ‘‘జీతేగా ఇండియా’’ అంటూ రీ ట్వీట్ చేసింది.
Read Also: IND vs AUS: గత 10 ఓవర్ల నుంచి లేని బౌండరీ.. ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, కేఎల్ రాహుల్
కాంగ్రెస్ పరోక్షంగా తన ఇండియా కూటమి గురించి ప్రస్తావించింది. 2024 ఎన్ని్కల్లో ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌తో పాటు దేశంలోని వివిధ ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, జేడీయూ, ఆప్, శివసేన(ఉద్ధవ్), ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడాలని భావిస్తున్నాయి. దీని కోసం సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తున్నాయి.