UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
- ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలు సిద్ధం..
- వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం..
- రాష్ట్రంలో ఆరు చోట్ల జన ఆశీర్వాద్ యాత్రలు..
- యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లతో ప్రభుత్వ అనుకూల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసింది. వచ్చే నెల నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 6 జన ఆశీర్వాద్ యాత్రలతో పాటు బూత్ స్థాయి సమావేశాలు, పార్టీ కార్యకర్తలతో సంప్రదింపులు, సోషల్ మీడియా ప్రచారంపై బీజేపీ ప్రత్యేక దృష్టిసారించాయి.
యూపీ ఎన్నికల కోసం బీజేపీ ప్రధాన నేతలు మధురలో రెండు రోజుల పాటు సమావేశమయ్యారు. దీని తర్వాత ఎన్నికల వ్యూహాలకు తుది రూపు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని సమాయత్తం చేయడం, ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read
- Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
- Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
- Madurai Tanishq Robbery Case: తనిష్క్ దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. TVK–NTK మధ్య పొలిటికల్ వార్..!
- India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
6 ప్రాంతాల్లో జన ఆశీర్వాద్ యాత్రలు..
బీజేపీ ఆరు ప్రాంతాల్లో జన ఆశీర్వాద్ యాత్రల్ని ప్లాన్ చేస్తోంది. బ్రజ్, పశ్చిమ యూపీ, కాన్పూర్-బుందేల్ఖండ్, కాశీ, అవధ్, గోరఖ్పూర్ ప్రాంతాలో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ప్రతీ యాత్రను రాష్ట్రంలోని సీనియర్ నాయకులు పర్యవేక్షించనున్నారు. ఈ యాత్రలన్నీ చివరగా లక్నోలో జరిగే భారీ బహిరంగ సభతో ముగియనున్నాయి. ఈ సభలో ప్రధాన నరేంద్రమోడీ ప్రసంగించే అవకాశం ఉంది.
బూత్ స్థాయి కార్యకర్తలపై దృష్టి..
క్షేత్రస్థాయిలో బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకోవడమే లక్ష్యంగా బూత్ స్థాయి సమావేశాలు, శక్తి కేంద్రాల సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తే ప్రథమం అనే నినాదంతో ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారి సమస్యల్ని తెలుసుకోవడంపై పార్టీ దృష్టిపెట్టింది. యూపీ ప్రభుత్వంలోని మంత్రులకు ఒక్కొక్కరికి జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నారు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో ప్రచారం..
డిజిటల్ ప్రచారాన్ని విస్తృతంగా వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. ప్రతీ జిల్లాలో ప్రముఖ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను గుర్తించి, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారి సహకారం తీసుకోనున్నారు. ప్రభుత్వ పనితీరును ప్రముఖంగా ప్రస్తావించాలని బీజేపీ భావిస్తోంది.
తాజావార్తలు
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
-
MS Dhoni Retirement: ధోనీ భాయ్.. జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
-
Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..