NTV Telugu Site icon

BJP New President: జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు

Bjp

Bjp

BJP New President: జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రాల్లోనూ అధ్యక్షులు మారనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ తీర్మానం చేసింది. ఇప్పుడు బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు లోబడే మార్పులు చేర్పులు జరుగుతాయి. బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను ఎంపిక చేశారు. బూత్ కమిటీల నుంచి ప్రారంభం చేసి రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయి ఎన్నికలను నిర్వహించనున్నారు. పార్టీ కొత్త కమిటీల ఎన్నికల్లో క్రియాశీలక సభ్యులదే కీలకపాత్ర. మూడు నెలల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఇక, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Read Also: Prithvi Shaw: పృథ్వీ షాపై వేటు.. ఇక కెరీర్‌ క్లోజ్ అయినట్టే?

ఇక, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కమలం పార్టీ.. పది కోట్ల మంది ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.. అంతర్గత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయి. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నికల ప్రక్రియ జరగనుంది.. ప్రాథమిక సభ్యత్వాలు పూర్తి చేసుకుని క్రియాశీలక సభ్యత్వాలు కొనసాగుతున్నాయి. బూత్ కమిటీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దేశవ్యాప్తంగా 10 లక్షల బూతులకు ఎన్నిక జరగనుంది అన్నారు. ప్రతి బూతు కమిటీలో అధ్యక్షుడితో పాటు 11 మంది సభ్యులు ఉంటారు. అన్ని రాష్ట్రాల రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తైంది.. ఒక సామాన్య కార్యకర్తగా వచ్చిన నన్ను ఎలక్షన్ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నాను అని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.

Read Also: Dharani Portal: ధరణి పోర్టల్‌ నిర్వహణ ఎన్‌ఐసీకి అప్పగించిన తెలంగాణ సర్కార్

ఇక, పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం జాతీయస్థాయి వర్క్ షాప్ పూర్తైందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రాల వర్క్ షాప్స్ 25 అక్టోబర్ లోపల నిర్వహిస్తాం.. నవంబర్ 5వ తేదీ వరకు జిల్లాల్లో వర్క్ షాపులు జరుగుతాయి.. నవంబర్ 15 లోపల బూత్ కమిటీల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. క్రియాశీలక సభ్యత్వం లేకపోతే పార్టీలో బాధ్యతలు ఇవ్వరు.. బీజేపీ ఒక కుటుంబ పార్టీ కా..దు ఒక వర్గం పార్టీ కాదు అని తెలిపారు. బీజేపీలో సామాన్య కార్యకర్తలు జాతీయ స్థాయికి ఎదిగారు.. బీజేపీలో సామాన్యులకు పెద్దపీట అని ఆయన వెల్లడించారు. కార్యకర్తలుగా నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేసినటువంటి వాళ్లకు బీజేపీలో కచ్చితంగా గుర్తింపు ఉంటుంది.. జనవరిలోగా పూర్తిచేయాలనేది మా టార్గెట్.. రాశుల అధ్యక్షులు ఎన్నికల తర్వాత జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటాం.. ఎన్నికల ప్రక్రియకు లోబడి అన్ని రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని లక్ష్మణ్ వెల్లడించారు.