NTV Telugu Site icon

Haryana: కాంగ్రెస్‌కి భారీ ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..

Haryana

Haryana

Haryana: కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర పరాజయం ఎదురైంది. హర్యానా స్థానిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానాలో ప్రభావంతమైన నేతగా చెప్పబడుతున్న భూపిందర్ హుడాకు కంచుకోటగా ఉన్న గురుగ్రామ్, రోహ్‌తక్‌తో సహా 10 మేయర్ స్థానాల్లో 09 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థి-బీజేపీ తిరుగుబాటు నేత డాక్టర్ ఇందర్‌జిత్ యాదవ్ 10వ స్థానమైన మానేసర్‌ని గెలుచుకున్నారు.

Read Also: Kakani Govardhan Reddy: నిరుద్యోగ భృతి ఊసేలేదు.. తల్లికి వందనంను ఎగ్గొట్టారు!

గతేడాది జరిగిన హర్యానా ఎన్నికల పరాభవం తర్వాత, మరోసారి కాంగ్రెస్‌కి దారుణమైన ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కాంగ్రెస్‌కి గట్టి పట్టున్న రోహ్‌తక్ మేయర్ సీటు కోసం బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ పడ్డారు. బీజేపీకి చెందిన రామ్ అవతార్ తిరుగులేని విజేతగా నిలిచారు. ఆయనకు లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సూరజ్మల్ కిలోయ్ 45,000 కంటే ఎక్కువ ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు.

అంబాలాలో బీజేపీ విజయం సాధించింది. ఫరీదాబాద్‌లో ఆధిక్యంలో ఉంది. అంబాలాలో బీజేపీ అభ్యర్థి శైలజా సచ్‌దేవా మేయర్‌గా ఎన్ని్కయ్యారు. ఈమె కాంగ్రెస్ అభ్యర్థి అమీషా చావ్లాను 20,487 ఓట్లతో ఓడించారు. ఫరీదాబాద్‌లో పర్వీన్ జోషి కాంగ్రెస్‌కి చెందిన లతా రాణిని ఓడించారు. హిసార్‌లో బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ పోప్లి గెలిచారు. కర్నాల్‌లో రేణు బాల గుప్తా కాంగ్రెస్‌ని ఓడించారు. పానిపట్‌లో బీజేపీ నేత కోమల్ సైని గెలిచారు. సోనిపట్‌లో రాజీవ్ జైన్ గెలిచారు.