NTV Telugu Site icon

BJP: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేని బహిష్కరించిన బీజేపీ..

Bjp

Bjp

BJP: బీజేపీని గత కొద్ది కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న కర్ణాటకకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యాత్నాల్‌ని బీజేపీ బహిష్కరించింది. పార్టీని, పార్టీ సీనియర్ నేత బీఎన్ యడియూరప్పకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కారణంగా 6 సంవత్సరాలు బహిష్కరించింది. పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ మార్చి 26, 2025న యత్నాల్‌ని బహిష్కరిస్తున్నట్లు లేఖ జారీ చేసింది. ఫిబ్రవరి 10న యత్నాల్‌కి షోకాజ్ నోటీసులు పంపినప్పటికీ స్పందించలేదని, పార్టీ క్రమశిక్షణను పదేపదే ఉల్లంఘించడాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బహిష్కరణ జరిగింది.

Read Also: Harsha Vardan : ఆమెతో ఏడేళ్ల లవ్.. అందుకే బ్యాచిలర్ గా ఉండిపోయా : హర్ష వర్ధన్

ఇటీవల బెంగళూర్‌లో బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన రన్యారావుపై ఆయన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై FIR నమోదైంది. దీనికి ముందు, మాజీ సీఎం, బీజేపీ అగ్రనేత యడియూరప్పను ఉద్దేశిస్తూ, ఆయన తన కొడుకు బీవై విజయేంద్రపై మోహాన్ని విడిచిపెట్టి, పార్టీపై దృష్టి పెట్టాలని సూచించాడు. యడియూరప్పపై వ్యాఖ్యల తర్వాత, బసవగౌడ పాటిల్ యత్నాల్ కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. యత్నాల్ వ్యాఖ్యలపై బీజేపీ 32 జిల్లా అధ్యక్షులు చర్యలు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి అధికారికంగా కోరారు.