BJP: బీజేపీని గత కొద్ది కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న కర్ణాటకకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యాత్నాల్‌ని బీజేపీ బహిష్కరించింది. పార్టీని, పార్టీ సీనియర్ నేత బీఎన్ యడియూరప్పకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కారణంగా 6 సంవత్సరాలు బహిష్కరించింది.