NTV Telugu Site icon

Madhy Pradesh: లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ..

Bjp

Bjp

Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో బీజేపీకి ఈ విజయం దక్కడంపై ఆ పార్టీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న 19 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. దీంతో 11 మున్సిపాలిటీల్లో బీజేపీ విజయం సాధించగా.. 8 పట్టణాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. బీజేపీ అభ్యర్థులు 183 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకోగా.. 143 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

Read Also: HCU: హెచ్‌సీ‌యూలో మోదీ డాక్యుమెంటరీ కలకలం.. అధికారులు విచారణ

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ సొంతగడ్డ రఘోఘర్ మున్సిపాలిటీ కూడా ఉంది. 24 కౌన్సిలర్ స్థానలు ఉన్న ఈ పట్టణంలో కాంగ్రెస్ 16 వార్డులను, బీజేపీ 8 వార్డుల్లో విజయం సాధించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ రాజేష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. 19 అర్బన్ బాడీలలోని 343 కౌన్సిలర్ స్థానాల్లో 183 స్థానాల్లో బీజేపీ, 143 స్థానాల్లో కాంగ్రెస్, మిగత చోట్ల ఇండిపెండెంట్లు గెలుపొందారు.

ఈ ఏడాది మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ గెలుపుపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. మరోసారి మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటుతో అధికారం కోల్పోయింది. సింథియా వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది.