Site icon NTV Telugu

Amit Shah: తమిళానికి స్టాలిన్ ఏం చేశారు.? బీజేపీ తమిళ భాష, సంస్కృతిని గౌరవిస్తుంది

Amit Shah

Amit Shah

Amit Shah: శుక్రవారం చెన్నైలో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తును అమిత్ షా అధికారికంగా ధ్రువీకరించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా, అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తమిళ భాష, తమిళ సంస్కృతిని గౌరవిస్తుందని, సీఎం స్టాలిన్ తమిళ భాష కోసం ఏం చేశారని ప్రశ్నించారు.

Read Also: Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌ను కోర్టుకు తరలింపు.. కేసు గురించి ఎస్పీ ఏమన్నారంటే?

డీఎంకే ప్రభుత్వం, స్టాలిన్ అవినీతికి పాల్పడ్డారని, తమిళ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో తమిళ మాధ్యమ విద్యను డీఎంకే అనుమతించడం లేదని అమిత్ షా విమర్వించారు. ఎన్డీయే ప్రభుత్వం ఉన్న ప్రతీ చోట, మెడిసిన్, ఇంజనీరింగ్ చదవడానికి మాతృబాష సిలబస్ అందుబాటులో ఉందని చెప్పారు. కానీ, మూడు సంవత్సరాలుగా స్టాలిన్‌ని తమిళభాషలో ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెట్టాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

డీఎంకే రాష్ట్ర సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి సాంస్కృతిక, మతపరమైన చర్చలను ఉపయోగిస్తోందని, డీఎంకే సనాతన ధర్మం, త్రిభాషా విధానం ప్రజల దృష్టి మళ్లించడానికే అని ఆయన అన్నారు. నీట్, డీలిమిటేషన్‌పై అనవసర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వం కుంభకోణాల్లో చిక్కుకుందని, ప్రభుత్వం మద్యం, ఇసుక తవ్వకం, రూ. 39,000 కోట్లకు పైగా కుంభకోణాల్లో చిక్కుకుందని అన్నారు. వీటిన్నింటికి తమిళ ప్రజలకు స్టాలిన్, ఉదయనిధి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Exit mobile version