Site icon NTV Telugu

MK Stalin: స్టాలిన్ బీహార్ టూర్‌పై దుమారం.. సవాల్ విసిరిన బీజేపీ

Mkstalin

Mkstalin

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీహార్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో బుధవారం స్టాలిన్ పాల్గొన్నారు. స్టాలిన్‌తో పాటు కనిమొళి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, డీఎంకే నేతలు గతంలో బీహారీయులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ గుర్తు చేసింది. వీటికి సమాధానం ఏదంటూ నిలదీస్తోంది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: చెల్లితో కలిసి రాహుల్‌గాంధీ బైక్ రైడింగ్

2017లో స్టాలిన్ మాట్లాడుతూ.. ఉత్తరాది రాష్ట్రాలు యువతకు తగిన అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయని.. దీంతో తమిళనాడు లాంటి రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో బీహారీయులు వలస వస్తున్నారని విమర్శించారు.

ఇక బీహారీలపై దయానిధి మారన్, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీహార్‌లో మళ్లీ గుర్తు చేసే ధైర్యం ఉందా? అంటూ బీజేపీ సవాల్ విసిరింది. స్టాలిన్ బీహార్ పర్యటనకు ముందు తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై ఎక్స్‌లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి, డీఎంకే నేతలు బీహార్ రాష్ట్ర ప్రజలను ఎగతాళి చేసిన వీడియోలు, క్లిప్‌లు పోస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Tawi Bridge: జమ్మూను ముంచెత్తిన భారీ వర్షాలు.. చూస్తుండగానే కూలిన తావి వంతెన.. షాకింగ్ వీడియో

‘‘బీహార్‌కు వెళ్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నేను సవాలు విసురుతున్నాను. మీకు ధైర్యం ఉంటే.. ‘‘సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి.’’ అని మీ కుమారుడు ఉదయనిధి చేసిన ప్రకటన గురించి అక్కడ మాట్లాడగలరా? మీ బంధువు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ తమిళనాడులో బీహారీలు టాయిలెట్లు శుభ్రం చేస్తారని చేసిన ప్రకటనను మీరు ధైర్యంగా పునరావృతం చేయగలరా?.’’ అని తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

 

Exit mobile version