NTV Telugu Site icon

Haryana Polls: బీజేపీ రెండో జాబితా విడుదల.. 21 మంది అభ్యర్థుల ప్రకటన

Bjplist

Bjplist

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండో జాబితాను మంగళవారం బీజేపీ ప్రకటించింది. 21 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను వెల్లడించింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది. హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాలకు మినహా మొత్తం 88 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించేసింది. బరోడా నుంచి ప్రదీప్ సాంగ్వాన్ పోటీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Home Minister Anitha: ప్రకాశం బ్యారేజీ కుల్చి వేతకు కుట్ర..! వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి..

ఇదిలా ఉంటే తొలి జాబితాలో సీనియర్లకు సీట్లు దక్కకపోవడంతో చాలా మంది అలకబూనారు. దీంతో ముఖ్యమంత్రి సైనీ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కొందరు కనీసం ముఖ్యమంత్రితో చేతులు కలిపేందుకు కూడా ఇష్టపడలేదు.

ఇది కూడా చదవండి: Home Minister Anitha: ప్రకాశం బ్యారేజీ కుల్చి వేతకు కుట్ర..! వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి..

ఇక కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తు పొసగలేదు. అనేక మార్లు పొత్తులపై చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రెండు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది. ఆప్ కూడా సోమవారం 20 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: CM relief fund: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరివిగా విరాళాలు