Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందువుల్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ చట్టాలను తీసుకువచ్చిందని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిందూ సమాజాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చిందని, చట్టాలను తీసుకువచ్చిందని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చని సూచించారు. ఈ మార్పులకు బీజేపీకి 400 లోక్‌సభ సీట్లతో పాటు మూడింట రెండోంతులు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండాలని కోరారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ)ని వెంటనే ప్రవేశపెట్టాలని ఉత్తర కన్నడ జిల్లాలో శనివారం జరిగిన సభలో ఆయన అన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించి, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సీఏఏని అమలు చేయకపోతే దేశంలో శాంతిభద్రతలు మన చేతుత్లో ఉండవు, ఇది దేశద్రోహులకు వేదిక అవుతుందని హెగ్డే అన్నారు. హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యల్లో ఇది లేటెస్ట్. గత నెలలో బీజేపీ, సంఘ్ పరివార్ లేకుండా ప్రపంచశాంతి ఉండదన్నారు. అంతకుముందు జనవరి నెలలో కర్ణాటకలోని భత్కల్ మసీదుకు కూడా బాబ్రీ మసీదు పరిస్థితే వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఆయనపై సుమోటోగా కేసు నమోదైంది.
Read Also: Mamata Banerjee: యూసుఫ్ పఠాన్ vs అధిర్ రంజన్ చౌదరి?.. కాంగ్రెస్‌కి షాకిచ్చిన దీదీ..
హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చడానికి 400 సీట్లు కావాలి’’ అని ఎంపీ చేసిన ప్రకటన ప్రధాని నరేంద్రమోడీ, సంఘ్ పరివార్ యొక్క దాడి ఉన్న ఉద్దేశాలను బహిరంగం చేశాయని అన్నారు. ఎక్స్ వేదికగా ‘‘నరేంద్ర మోడీ, బీజేపీ అంతిమ లక్ష్యం బాబా సాహెబ్ రాజ్యాంగాన్ని నాశనం చేయడమే. వారు న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తారు’’ అని అన్నారు. సమాజాన్ని విభజించడం, మీడియానున బానిసలా చేయడం, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం, స్వతంత్ర సంస్థల్ని నిర్వీర్యం చేయడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నియంత్రుత్వంగా మార్చాలని అనుకుంటున్నారని ఆరోపించారు. స్వాతంత్ర వీరుల కలలతో పాటు ఈ కుట్రల్ని ఫలించబోమని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం కోసం మా చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటామని, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వెనకబడి, మైనారిటీ వర్గాలు మేల్కోవాలని, మీ గళం విప్పాలని, భారతదేశం మీతో ఉందని అన్నారు.
