BJP MP Pragya Thakur Named In Police Case For “Hindus, Keep Knives” Speech: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్(సాధ్వి ప్రజ్ఞా) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక శివమొగ్గలో రెచ్చగొట్టే ప్రకటన చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ వేదిక దక్షిణ ప్రాంత సదస్సులో మాట్లాడుతూ.. ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఈ భోపాల్ ఎంపీపై ఫిర్యాదు నమోదైంది. ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Read Also: Twitter Down: ట్విట్టర్ డౌన్.. మరోసారి లాగిన్ లో సమస్యలు
ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మండిపడ్డారు. బీజేపీ ఎంపీ చేసిన ‘‘ కత్తులకు పదును పెట్టండి’’ అనే వ్యాఖ్యలపై బుధవారం హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అమిత్ షాను ప్రగ్యా ఠాకూర్ అపహాస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ప్రగ్యా చేసిన వ్యాఖ్యలు హింసకు దారి తీస్తాయని.. ఇందులో కొంత ప్రణాళిక ఉందని అన్నారు. దేశంలో భద్రత కల్పించడం కేంద్ర హోంమంత్రి విధి అని.. కానీ సాధ్వీ వ్యాఖ్యలు హోంమంత్రి పనికిరారని చెప్పే విధంగా ఉన్నాయని విమర్శించారు. కత్తులకు పదును పెట్టే పని చేస్తే.. భద్రతా దళాలు ఏం చేస్తాయి.? చట్టం ఏం చేస్తుంది.? అని ప్రశ్నిస్తూ.. కేంద్ర హోంమంత్రి తన కొడుకును బీసీసీఐ అధిపతిని చేయడం కోసమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇటీవల కర్ణాటకలో హిందూ జాగరణ్ వేదిక కార్యక్రమానికి హాజరైన సాధ్వి ప్రజ్ఞా, తమపై దాడి చేసే వారిపై స్పందించే హక్కు హిందువులకు ఉందని.. పదునైన కత్తులను వారి ఇళ్లలో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. మీ కుమార్తెలను సురక్షితంగా మరియు రక్షించుకోండి. ఇంట్లో ఆయుధాలు ఉంచండి. కూరగాయలు కోయడానికి ఉపయోగించే కత్తికి పదును పెట్టండని కామెంట్స్ చేశారు. ముస్లింలను ఉద్దేశించి.. వారికి జిహాద్ తెలుసు..వారు లవ్ చేసిన అందులో జిహాద్ చేస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కాంగ్రెస్ శివమొగ్గ జిల్లా అధ్యక్షుడు సుందరేష్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 153ఏ, 153బీ, 268, 295ఏ, 298, 504, 508 సెక్షన్‌ల కింద బీజేపీ ఎంపీపై కేసులు నమోదు అయ్యాయి.