NTV Telugu Site icon

Priyanka Gandhi: ప్రియాంకకు 1984తో కూడిన బ్యాగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన బీజేపీ.. తీసుకుని ఏం చేశారంటే..!

Priyankagandhi

Priyankagandhi

కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి పార్లమెంట్ ఆవరణలో అనూహ్యమైన పరిణామం ఎదురైంది. ఓ బీజేపీ మహిళా ఎంపీ ఇచ్చిన బ్యాగ్‌తో అవాక్కయ్యారు. ప్రియాంకా గాంధీకి ‘1984’ బ్యాగ్‌ను బహుమతిగా బీజేపీ ఎంపీ అపరాజితా షడంగి అందజేశారు.

ఇది కూడా చదవండి: Pushpa 2: వందేళ్ల హిందీ సినిమా చరిత్రను తిరగరాసిన అల్లు అర్జున్‌

ప్రియాంక గాంధీ ఈ వారంలో రెండు సార్లు.. రెండు దేశాలకు సంబంధించిన బ్యాగ్‌లు ధరించి పార్లమెంట్ ఆవరణలో ప్రత్యక్షమయ్యారు. ఒకటి పాలస్తీనాకు మద్దతు తెలిపిన బ్యాగ్‌తో కనిపించారు. రెండో రోజు బంగ్లాదేశ్‌కు చెందిన బ్యాగ్‌తో హల్‌చల్ చేశారు. ఒకసారి మాత్రం అదానీ-మోడీ కలిసి ఉన్న బ్యాగ్ ధరించారు. ఇలా బ్యాగ్‌లతో ఆయా సందేశాలు అందజేశారు. అయితే శుక్రవారం మాత్రం.. బీజేపీ మహిళా ఎంపీ మాత్రం.. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన సిక్కుల ఊచకోతను గుర్తు చేసే బ్యాగ్‌ను అందజేశారు. అయితే ప్రియాంక మాత్రం.. ఆ బ్యాగ్‌ను తీసుకుని కొద్దిసేపటికే పక్కన పడేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్యాగ్‌పై ‘1984’ అని ఎరుపు రంగుతో రాసి ఉండడం విశేషం.

ఇది కూడా చదవండి: Divorce Case: “బిడ్డకు పేరు పెట్టే విషయంలో గొడవ”.. పిల్లాడికి కోర్టు ఏం పేరు పెట్టిందో తెలుసా..

ఎంపీ అపరాజితా షడంగి సోషల్‌ మీడియాలో ఫొటో షేర్ చేసి పలు కామెంట్లు చేశారు. ‘‘కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకకు బ్యాగులంటే చాలా ఇష్టం. అందుకే ఆమెకు ‘1984’ నాటి సిక్కుల ఊచకోతకు సంబంధించిన బ్యాగు అందజేశాను. తొలుత దాన్ని తీసుకోవడానికి ఆమె నిరాకరించినా.. తర్వాత తీసుకొని పక్కన పెట్టేశారు’’ అని రాసుకొచ్చారు. గత 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో నేటితరానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ బ్యాగును బహూకరించానని ఆమె పేర్కొన్నారు.