NTV Telugu Site icon

BJP: సీట్లు తగ్గినా లొంగిపోయేందుకు సిద్ధంగా లేని బీజేపీ..

Nda

Nda

BJP: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 543 లోక్‌సభ సీట్లలో 293 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది. 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి మాత్రం మెజారిటీకి కేవలం 32 సీట్ల తగ్గాయి. దీంతో మిత్రపక్షాలైన 16 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ (12), ఏక్నాథ్ షిండే శివసేన (7), చిరాగ్ పాశ్వాన్ యొక్క లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ (5) బీజేపీ మెజారిటీకి చేరుకోవడంలో కీలకంగా మారాయి.

అయితే, సంక్షీర్ణంతో మోడీ3.0 ప్రభుత్వం ఏర్పడుతుండటంతో మిత్రపక్షాలు తమ డిమాండ్లను, కేబినెట్ బెర్తుల్ని బీజేపీ ముందు ఉంచుతున్నారు. కీలకమైన ఫోర్ట్‌పోలియోను దక్కించుకోవాలని డిమాండ్లు చేస్తున్నట్లు సమచారం. అయితే, బీజేపీ మిత్రపక్షాలకు లొంగపోవడానికి సిద్ధంగా లేదని సమచారం. కీలమైన మంత్రిత్వ శాఖల్ని తన వద్దే ఉంచుకోవాలని అనుకుంటోంది.

Read Also: Delhi: తీహార్ జైలులో గ్యాంగ్ వార్.. ఖైదీని కత్తితో పొడిచిన ప్రత్యర్థులు

టీడీపీ లోక్‌సభ స్పీకర్ పదవిని కోరడంతో పాటు రెండు కేబినెట్ బెర్తుల్ని అడుగుతుందని, జేడీయూ రైల్వే, వ్యవసాయశాఖను అడుగుతోందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఐటీ, రోడ్డు రవాణా వంటి కీలకమైన శాఖల్ని తన వద్దే పెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు నితీష్ కుమార్ ఎన్డీయే ప్రభుత్వం కోసం ‘‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’’ కోసం ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. స్పీకర్ పోస్టును వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఇప్పుడు ఉన్న సమచారం ప్రకారం.. జేడీయూకి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఇవ్వవచ్చు. టీడీపీకి పౌరవిమానయానం, ఉక్కు పరిశ్రమలను ఇవ్వవచ్చని తెలుస్తోంది. టూరిజం, స్కిల్ డెవలప్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్స్ వంటి ఇతర పోర్ట్‌ఫోలియోలను పోర్ట్‌ఫోలియోలకు అప్పగించడానికి బిజెపి సిద్ధంగా ఉండవచ్చు.