NTV Telugu Site icon

Ramesh Bidhuri: నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. కల్కాజీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా తయారు చేస్తా..

Bjp

Bjp

Ramesh Bidhuri: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల మధ్య మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్‌ నేత రమేష్‌ బిదూరి వయనాడ్ కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనను అభ్యర్థిగా కమలం పార్టీ ప్రకటించింది. అయితే, బిదూరి తాజాగా మాట్లాడుతూ ప్రియాంక గాంధీపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని హాట్ కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు.

Read Also: JC Prabhakar Reddy: ఆవేశంలో మాట్లాడా.. సినీనటి మాధవీలతకు క్షమాపణలు!

ఇక, ఈ విషయంపై మీడియా బీజేపీ నేత రమేష్ బిదూరిని ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనంటూ ఒప్పుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా హీరోయిన్‌ హేమమాలినిపై ఇలాంటి కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. లాలూ చేసింది తప్పయితే తనది కూడా తప్పేనని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నిజానికి ప్రియాంక గాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని రమేష్ బిదూరి గుర్తు చేశారు.

Show comments