Mohan Charan Majhi: ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం..

  • ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం..
  • సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీలు బాధ్యతలు..
  • తొలిసారిగా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం..
  • కార్యక్రమానికి పీఎం మోడీ హాజరు.
Mohan Majhi

Mohan Majhi

Mohan Charan Majhi: ఒడిశా ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీతో అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా సహా బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా, మూడో గిరిజన ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ చరిత్రి సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 78 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేడీ 51 స్థానాలకు పరిమితమైంది.

Read Also: Heart Pain-Acidity: గుండెనొప్పి, ఎసిడిటీ వల్ల ఛాతిలో కలిగే బాధ మధ్య తేడా ఇదే..

సీఎంగా మోహన్ మాఝీ, ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్థన్ సింగ్ దేవ్, ప్రవతి పరిదా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మాఝీకి ప్రధాని నరేంద్రమోడీ పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సీఎం ప్రమాణస్వీకారానికి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు. అమిత్ షా, నవీన్ పట్నాయక్‌ని సాదరంగా ఆహ్వానించారు.