Site icon NTV Telugu

Annamalai: స్టాలిన్‌ది కపట రాజకీయం.. బీహార్ టూర్‌పై అన్నామలై విమర్శలు

Annamalai

Annamalai

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఎన్నికల సంఘం.. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక బుధవారం రాహుల్‌గాంధీకి మద్దతిచ్చేందుకు స్టాలిన్ బీహార్‌ వెళ్లారు. ఒకే వాహనంపై తేజస్వి యాదవ్, స్టాలిన్, రాహుల్ గాంధీ కనిపించిన ఫొటో వైరల్ అయింది. ఈ ఫొటోపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీహారీయులపై గతంలో స్టాలిన్ వ్యాఖ్యలను, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను, డీఎంకే నేత దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బీజేపీ నేత అన్నామలై సోషల్ మీడియాలో విమర్శించారు. గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి బీహార్‌లో గుర్తు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Maharashtra: బర్త్‌డే సెలబ్రేషన్‌‌లో ఉండగా ‘మహా’ ఘోరం.. చిన్నారి సహా 15 మంది మృతి.. వెలుగులోకి ఫొటోలు

తాజాగా మరోసారి స్టాలిన్‌పై అన్నామలై విమర్శలు గుప్పించారు. స్టాలిన్ బీహార్ పర్యటన కేవలం రాజకీయ కపటమేనని వ్యాఖ్యానించారు. బీహారీయులపై డీఎంకే చూపిన అసహనాన్ని కప్పిపుచ్చుకునేందుకే యాత్ర అని తెలిపారు. ముగ్గురు నేతలు నిస్సహాయ రాజవంశీయులుగా అభివర్ణించారు.

త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టి 65 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో రాహుల్‌గాంధీ ఓటర్ అధికార్ యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో ఎంపీ కనిమొళితో కలిసి స్టాలిన్ పాల్గొన్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాపాడండి అనే నినాదంతో ముజఫర్‌నగర్‌లో జరిగిన మార్చ్‌లో కనిమొళి, స్టాలిన్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ర్యాలీలో పాల్గొన్న కనిమొళి.. రాహుల్, తేజస్వి, స్టాలిన్‌ల ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ముగ్గురు భారతదేశ భవిష్యత్ అని అభివర్ణించారు. ‘‘కలిసి మనం లేస్తాం. కలిసి ప్రతిఘటిస్తాం. బీజేపీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బీహార్‌లో ఇండియా కూటమి చేతులు కలుపుతుంది.’’ అని పేర్కొన్నారు. ఆగస్టు 17న రాహుల్ గాంధీ ప్రారంభించిన యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ముగినుంది.

 

Exit mobile version