NTV Telugu Site icon

Maharashtra CM: ఈ నెల 26న మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం..

Bjp

Bjp

Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288 స్థానాలకు గానూ 221 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సిద్ధమైంది. ఈ మేరకు ఈనెల 25వ తేదీన లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ భేటీలో సీఎం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతి రోజు అంటే 26న నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలను వెల్లడించినట్లు మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి.

Read Also: Maharashtra: మహారాష్ట్ర సీఎం ఎవరు..? ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..

అయితే, ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 సీట్లు కావాల్సి ఉండగా.. ఎన్డీయే కూటమి 221 సీట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇందులో బీజేపీ 128 స్థానాల్లో, శివసేన(షిండే) 55 స్థానాల్లో, ఎన్సీపీ(పవార్‌) 35 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కేవలం 51 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఎంవీఏలో భాగమైన కాంగ్రెస్‌ పార్టీ 20 స్థానాల్లో ముందంజలో ఉండగా.. శివసేన (ఉద్ధవ్‌) 16 స్థానాల్లో, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ-ఎస్పీ) 13 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది.