Mehbooba Mufti: జీ 20 దేశానికి సంబంధించిన కార్యక్రమం అని.. కానీ బీజేపీ దాన్ని హైజాక్ చేసిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ బెంగళూర్ లో ఆరోపించారు. జీ 20ని వ్యతిరేకించడం లేదని, కానీ బీజేపీ హైజాక్ చేసిందని అన్నారు. చివరకు జీ 20 లోగోను కూడా కమలంగా మార్చిందని ఆమె విమర్శించారు. లోగో దేశానికి చెందినదిగా ఉండాలని, పార్టీకి సంబంధించిన విధంగా ఉండకూడదని ఆమె అన్నారు.
Read Also: G20: కాశ్మీర్‌లో జీ 20 సమావేశం.. 26/11 తరహా టెర్రర్ అటాక్స్‌కి కుట్ర.. పాకిస్తాన్ పన్నాగం
ప్రస్తుతం కాశ్మీర్ లో ఇళ్లను తీసుకుంటున్నారు, విపరీతంగా సెక్యురిటీని పెంచారని, ప్రతీ చోట తనఖీలు జరుగుతున్నాయని అన్నారు. కాశ్మీర్ సమస్యలు ఈ రీజియన్ కు సంబంధించినవని, సార్క్ కూటమి ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. జీ 20ని బీజేపీ పబ్లిసిటీకి ఉపయోగించుకుంటుందని విమర్శించారు. విశ్వగురు కావాలంటే ముందుగా ఈ సౌత్ ఏషియా రీజియన్ లో గురుగా ఆవిర్భించాలని బీజేపీకి సూచించింది.
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకు వచ్చే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని మహబూబా ముఫ్తి స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగకపోవచ్చని ఆమె అన్నారు. భారతదేశ మనుగడ కోసం ఇతర పార్టీలతో పోలిస్తే.. కాంగ్రెస్ పార్టీపై అతిపెద్ద బాధ్యత ఉందని ఆమె అన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు శ్రీనగర్ లో జీ 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశానికి 60కి పైగా విదేశీ ప్రముఖులు హాజరవుతున్నారు. దీని కోసం భారత ప్రభుత్వం కాశ్మీర్ లోయ అంతటా భద్రతను కట్టుదిట్టం చేసింది.
