Rahul Gandhi vs BJP: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ హయాంలో అమల్లోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MNREGA) రద్దు చేసి, దాని స్థానంలో G-RAM-G అనే కొత్త ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇక, ఢిల్లీలోని జవహర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. MNREGA పేదలకు ఉపాధి హక్కు కల్పించింది.. మోడీ ప్రభుత్వం దానిని పూర్తిగా తొలగించాలని చూస్తుందని ఆరోపించారు. 2020లో రైతుల తీవ్ర నిరసనల అనంతరం వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్న ఉదంతాన్ని గుర్తు చేశారు. ప్రజలు ఏకమైతే ఈ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి, MNREGA తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.
Read Also: David Reddy : మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ పవర్ ఫుల్ అప్డేట్..
అయితే, మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ఈ కొత్త చట్టం ద్వారా మహాత్మా గాంధీ పేరును ప్రజల జ్ఞాపకాల నుంచి తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ అంశాన్ని బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ పార్లమెంట్లో లేవనెత్తుతామని తెలిపారు. కాగా, ప్రతిపక్షాలు బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు MNREGAకు మద్దతుగా అసెంబ్లీల్లో తీర్మానాలు తీసుకు వచ్చాయి. కర్ణాటకలో గవర్నర్ ప్రభుత్వ ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అలాగే, తమిళనాడులో కూడా గవర్నర్- సర్కార్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Read Also: BMC Elections: ముంబై మేయర్ పీఠం మహిళదే.. లాటరీ డ్రాలో తేలిన ఫలితం..
ఇక, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ప్రతిస్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు “శ్రీరాముడికి వ్యతిరేకం” అని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీకి “హిందూ వ్యతిరేక మనస్తత్వం” ఉందని విమర్శలు గుప్పించింది. G-RAM-G పేరులో భగవాన్ శ్రీరాముని పేరు ఉంది, అందుకే కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కాగా, G-RAM-G చట్టంలో ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచారు. అయితే, ఈ హామీ కేంద్ర ప్రభుత్వం “గ్రామీణ ప్రాంతం”గా ప్రకటించిన ప్రాంతాల్లో మాత్రమే వర్తిస్తుంది. MNREGA అమల్లో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించబడింది. అలాగే, నిధుల వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. MNREGAలో ఖర్చులో సుమారు 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించగా, G-RAM-Gలో రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుందని వెల్లడించింది.